సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని బొల్లారం 20 బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ క్యాంప్‌లో జరిగిన ఆయుధాల చోరీ కేసులో పోలీసులు భారీ కుట్రను ఛేదించారు. బ్యాంకులు, జ్యువెలరీ షాపులు, సంపన్నుల ఇళ్లలో దోపిడీలకు ఈ ఆయుధాలను ఉపయోగించేందుకు పథకం రచించినట్లు దర్యాప్తులో తేలింది. కేసులో ముగ్గురు సర్వీసులో ఉన్న ఆర్మీ జవాన్లతో పాటు ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ హవల్దార్ ఉప్పుతోళ్ల మల్లేశ్ అలియాస్ రాజుకు మరో ఇద్దరు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఆయుధాగారం ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్న వినోద్, శేషులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మల్లేశ్‌తో వినోద్‌కు ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తులో తేలినట్లు పోలీసులు వెల్లడించారు.
బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ కేసులో నిందితుడు మల్లేష్‌ను విచారించిన పోలీసులు కీలక విషయాలను గుర్తించారు. చోరీకి నాలుగు నెలల ముందే అతడు పథకం రూపొందించినట్లు దర్యాప్తులో తేలింది. ఆదివారం గార్డులు, ఆర్మీ అధికారుల కదలికలు తక్కువగా ఉంటాయని భావించి అదే రోజును ఎంచుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ బొల్లారంలోని మద్రాస్ రెజిమెంటల్ సెంటర్ ఆయుధాల చోరీ కేసును తెలంగాణ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఇటీవలే పదవీ విరమణ పొందిన హవల్దార్ ఉప్పుతోళ్ల మల్లేశ్‌ను గుర్తించినట్లు రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. రిటైర్మెంట్‌పై అసంతృప్తితో ముందస్తు ప్రణాళిక ప్రకారం ఆయుధాలు, మందుగుండు సామగ్రిని చోరీ చేసి.. వాటిని నాగర్‌కర్నూల్‌లోని తన స్వగ్రామం, యాప్రాల్‌లోని మరో ప్రాంతంలో పాతిపెట్టినట్లు పోలీసులు తెలిపారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని బొల్లారం 20 మద్రాస్ రెజిమెంట్ ఆయుధాగారం నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి చోరీ కేసులో అరెస్టులపై వస్తున్న వార్తలను తెలంగాణ పోలీసులు ఖండించారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ స్పష్టం చేశారు. మరోవైపు, రెజిమెంట్ సమీపంలో 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు లభించడంతో దర్యాప్తు మరింత కీలకంగా మారింది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలను బొల్లారం వద్ద పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌పై దాడికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపిస్తూ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
సికింద్రాబాద్ బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్‌లో జరిగిన అత్యాధునిక ఆయుధాల చోరీ ఘటనపై దర్యాప్తు ముమ్మరమైంది. చోరీ జరిగి నాలుగు రోజులు గడిచినా ఆయుధాల ఆచూకీ లభించకపోవడంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఉగ్రకుట్ర కోణంపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో NIA, IB, మిలిటరీ, స్థానిక పోలీసులు కలిసి దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ బొల్లారం మద్రాస్ రెజిమెంట్ పరిసరాల్లో డిటోనేటర్ల కలకలం రేగింది. ఫైరింగ్ క్యాంప్ సమీపంలో అనుమానాస్పదంగా ఉన్న బకెట్‌ను పోలీసులు తనిఖీ చేయగా 160 డిటోనేటర్లు బయటపడ్డాయి. దీంతో బాంబ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించి పరిసరాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.