దేవాదుల ప్రాజెక్టుకు పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టాలి.. అమెరికాలో బీఆర్ఎస్ ఎన్‌ఆర్ఐల తీర్మానం

అమెరికాలో జరుగుతున్న అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (ATA) మహాసభల్లో తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది సుదర్శన్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ యూఎస్‌ఏ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు

2 ఆగస్టు, 2026 9:03 PM•ByRalin

Share this article

దేవాదుల ప్రాజెక్టుకు పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టాలి.. అమెరికాలో బీఆర్ఎస్ ఎన్‌ఆర్ఐల తీర్మానం

పెద్ది సుదర్శన్ రెడ్డి (File Photo)

అమెరికాలో జరుగుతున్న అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (ATA) మహాసభల్లో తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది సుదర్శన్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ యూఎస్‌ఏ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంతాప సభలో ఆయన తెలంగాణ ఉద్యమానికి చేసిన సేవలను కొనియాడుతూ పలువురు నాయకులు నివాళులర్పించారు.

బీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ యూఎస్‌ఏ ఇన్‌చార్జి మహేశ్ తన్నీరు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు సి. లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, మాజీ ఎమ్మెల్సీ కర్ణే ప్రభాకర్‌, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్‌. రాజేందర్‌రెడ్డి, గడారి కిశోర్‌, పుట్ట మధు, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, కర్నాటి విద్యాసాగర్‌, కంచర్ల కృష్ణారెడ్డి, నంద్యాల దయాకర్‌రెడ్డి, రఘువీర్‌సింగ్‌, రేగట్టె మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి రెడ్డి ఎర్రంరెడ్డి, చందు తాళ్లా, నరసింహ నాగులవంచ, రజనీకాంత్‌ కోసనం కార్యక్రమ నిర్వహణలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పెద్ది సుదర్శన్‌రెడ్డి చేసిన త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు. ఉద్యమ సమయంలో తీవ్ర గాయాల పాలై ఒక కాలును, ఒక కన్నును కోల్పోయినా వెనుకడుగు వేయకుండా తెలంగాణ కోసం చివరి వరకు పోరాడిన నాయకుడిగా ఆయనను గుర్తు చేసుకున్నారు. అలాంటి ఉద్యమ యోధుల సేవలను తెలంగాణ సమాజం ఎప్పటికీ మరువదని అన్నారు.

ప్రభుత్వానికి విజ్ఞప్తి

పెద్ది సుదర్శన్‌రెడ్డి ఉద్యమ సేవలకు శాశ్వత గుర్తింపుగా దేవాదుల ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టాలని బీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ యూఎస్‌ఏ ఇన్‌చార్జి మహేశ్ తన్నీరు ప్రతిపాదించారు. అలాగే ఆయన స్వస్థల ప్రాంతంలో ఏర్పాటు కానున్న ప్రభుత్వ వైద్య కళాశాలకు కూడా పెద్ది సుదర్శన్‌రెడ్డి పేరు నామకరణం చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.

ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోకపోతే, భవిష్యత్తులో బీఆర్‌ఎస్‌ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాదుల ప్రాజెక్టు, ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు పెద్ది సుదర్శన్‌రెడ్డి పేరును పెట్టేలా చర్యలు చేపడతామని నాయకులు స్పష్టం చేశారు.

సభలో పెద్ది సుదర్శన్‌రెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి రెండు నిమిషాల మౌనం పాటించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆయన ఆశయాల సాధనకు కట్టుబడి పనిచేయడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. సభకు హాజరైన ఎన్‌ఆర్‌ఐలు, నాయకులు, జర్నలిస్టులు పెద్ది సుదర్శన్‌రెడ్డితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వేలాది మంది ప్రతినిధులు పాల్గొన్న ఈ సంస్మరణ సభ భావోద్వేగ వాతావరణంలో జరిగింది.

▶CategoriesNews, Nri and Telangana
▶Follow us onFacebook, Twitter & Instagram.
Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు