నాగార్జున సాగర్,10 (జనవాణి): నాగార్జునసాగర్ విజయ విహార్ వద్ద కృష్ణా నది తీరంలో నిర్వహిస్తున్న మహా వరుణ యాగంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులు సోమవారం పాల్గొన్నారు. యాగంలో భాగంగా నిర్వహించిన పూర్ణాహుతి క్రతువులో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో ఈ మహా వరుణ యాగాన్ని నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య యాగ క్రతువులను నిర్వహించారు.
108 మంది రుత్వికులు.. 11 హోమగుండాలు
మహా వరుణ యాగాన్ని 108 మంది రుత్వికులు, 11 హోమగుండాలతో నిర్వహించారు. యాగంలో భాగంగా వివిధ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ ఈ యాగాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులతో ప్రారంభం
మహా వరుణ యాగ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు ప్రారంభించారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు యాగ కార్యక్రమంలో పాల్గొని పూర్ణాహుతి నిర్వహించారు. నాగార్జునసాగర్ కృష్ణా నది తీరంలో ఆధ్యాత్మిక వాతావరణంలో మహా వరుణ యాగం కొనసాగింది.
Loading Tweet...




















