మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబ ఆస్తులపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ధైర్యముంటే కుటుంబానికి చెందిన మొత్తం ఆస్తుల వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు. హైటెక్ సిటీ సమీపంలోని స్టార్ హోటళ్లతో పాటు అమెరికా, సింగపూర్‌లో పెట్టుబడులపై కూడా రేవంత్ ప్రశ్నలు సంధించారు.
మంత్రి కొండా సురేఖ చేసిన తాజా వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. తనపై చర్యలు తీసుకునే ముందు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. పలువురు మంత్రులు, నేతలపై ఆరోపణలు ఉన్నాయని, వారికి ఒక న్యాయం.. తనకు మరో న్యాయం ఎందుకని సురేఖ ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక వెబ్‌సైట్, ఆన్‌లైన్ పోర్టల్ ఏర్పాటు చేసి డిజిటల్ విధానంలో ప్రక్రియను చేపట్టాలని సూచించారు. ఉద్యమకారుల సంక్షేమం కోసం 250 గజాల ఇళ్ల స్థలం, హెల్త్ కార్డులు, ఆసరా పెన్షన్, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం వంటి డిమాండ్లపై కమిటీతో చర్చించారు.
పాలిటెక్నిక్ విద్యార్థుల్లో నెలకొన్న భయాందోళనలను ప్రభుత్వం నివృత్తి చేయాలని, వెంటనే జీవో 97ను రద్దు చేయాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి కోరారు. పాలిటెక్నిక్ విద్యను టెక్నికల్, ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ పరిధిలోనే కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని అక్కాచెల్లెళ్లకు శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి రాఖీ పండుగ ప్రతీక అని పేర్కొంటూ.. ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఆరోగ్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో అసెంబ్లీ సమావేశాలతో పాటు నియోజకవర్గాల అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ పనులపై సీఎం కీలక సూచనలు చేశారు.
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు చట్టబద్ధత లేదంటూ దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కౌంటర్ దాఖలు చేయకుండా జాప్యం చేస్తోందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కౌంటర్ సిద్ధమైన తర్వాత దాన్ని ఆపమని ఎవరు ఆదేశించారని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక హామీ ఇచ్చారు. ఇకపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసి పోటీ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఏ ఉద్యోగ ఖాళీని కూడా నిర్లక్ష్యం చేయబోమని స్పష్టం చేశారు.
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వేర్వేరు కాదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పేదలకు సన్నబియ్యం అందించాలనే ఆలోచన చేయలేదని ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.
బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తాను చేసిన వ్యాఖ్యల వెనుక ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మద్దతు ఇచ్చానని తెలిపారు.
హైదరాబాద్ మెట్రోలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు కోచ్‌లు కొనుగోలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మెట్రో ఫేజ్-2లోని ఎంజీబీఎస్–చాంద్రాయణగుట్ట 7.5 కి.మీ కారిడార్ పనులను వేగవంతం చేసి, టెండర్లు, భూసేకరణ ప్రక్రియలను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరిగే లష్కర్ బోనాల మహోత్సవం ఘనంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు.
నీట్ పేపర్ లీకేజీపై పోరాడుతున్న విద్యార్థులకు మద్దతుగా నిలిచిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై ఢిల్లీ పోలీసుల చర్యలను నిరసిస్తూ సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్‌లో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు భవిష్యత్తుకు సంబంధించి అత్యంత కీలకమైన అడుగు పడింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి.. కేంద్రమంత్రులతో జరిపిన వరుస సమావేశాలు విజయవంతమయ్యాయి.