మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబ ఆస్తులపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ధైర్యముంటే కుటుంబానికి చెందిన మొత్తం ఆస్తుల వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు. హైటెక్ సిటీ సమీపంలోని స్టార్ హోటళ్లతో పాటు అమెరికా, సింగపూర్‌లో పెట్టుబడులపై కూడా రేవంత్ ప్రశ్నలు సంధించారు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో సిరిసిల్ల తీవ్ర సమస్యలకు కేంద్రంగా మారిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. సిరిసిల్లను ‘సిరుల సిల్ల’గా కాకుండా ‘ఉరిసిల్ల’గా మార్చారని ఆరోపించారు. సిరిసిల్ల కార్మికులు ఎదుర్కొన్న సమస్యలు, ఆత్మహత్యలు, గల్ఫ్ వలసలపై మాజీ మంత్రి కేటీఆర్‌ను సీఎం ప్రశ్నించారు.
కరీంనగర్ జిల్లాలో పర్యటించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కొత్త కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించడంతో పాటు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. పేదలకు సంక్షేమ పథకాలు చేరేలా అధికారులు పనిచేయాలని సూచించారు.
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి ప్రతిష్టాత్మక ఆర్యదాన్ మహమ్మద్-2026 బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ అవార్డు దక్కనుంది. రైతులు, బీసీలు, సామాన్య ప్రజల కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, ప్రజాస్వామిక విలువల పట్ల ఆయన నిబద్ధతను గుర్తిస్తూ ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు నిర్వాహకుల జ్యూరీ వెల్లడించింది.
ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టులో కీలక విచారణ జరిగింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా సుమారు గంటన్నరపాటు వాదనలు వినిపించారు.
వినాయక చవితి సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి గణపతి పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లోని విఘ్నాలన్నీ తొలగిపోయి, తెలంగాణ సుభిక్షంగా ఉండాలని గణనాథుడిని ప్రార్థించారు. ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.
రియల్ ఎస్టేట్ ఆరోపణలపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డబ్బే తన లక్ష్యమైతే రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదని, రియల్ ఎస్టేట్ రంగంలోనే కొనసాగి ఉంటే వేల కోట్ల సంపద సంపాదించే అవకాశం ఉండేదని అన్నారు. కోకాపేట, పుప్పాలగూడ, మంచిరేవుల ప్రాంతాలు భవిష్యత్‌లో విలువైనవిగా మారతాయని తాను ముందుగానే గుర్తించినట్లు తెలిపారు.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అనంతరం మంత్రి కొండా సురేఖ మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో కుటుంబ సభ్యులు, బంధువులకు పదవులు ఇచ్చారని ఆరోపించిన ఆయన.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన, తమ రెండున్నరేళ్ల పాలనపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని రేవంత్ సవాల్ విసిరారు.
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియపై సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 73.39 లక్షల ఓటర్ల ఎంట్రీలను ASDD కేటగిరీలో చేర్చడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు లేఖ రాశారు. అర్హులైన ఓటర్లకు అన్యాయం జరగకుండా క్లెయిమ్స్, అభ్యంతరాల గడువును మరో నాలుగు వారాలు పొడిగించాలని కోరారు.
రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని అక్కాచెల్లెళ్లకు శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి రాఖీ పండుగ ప్రతీక అని పేర్కొంటూ.. ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఆరోగ్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తనకు జరిగిన అవమానం కాదని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానమని అన్నారు. రాజకీయ కారణాలతోనే తన పర్యటనను అడ్డుకున్నారని ఆరోపించిన సీఎం.. గుజరాత్ ముఖ్యమంత్రికి అమెరికా పర్యటనకు అనుమతి ఇచ్చి, తనకు ఎందుకు నిరాకరించారో ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించినట్లు సీఎంఓ వెల్లడించింది. దీంతో ఆగస్టు 23న అమెరికా వెళ్లాల్సిన రేవంత్ రెడ్డి పర్యటన రద్దయింది. లండన్ పర్యటన ముగించుకుని అదే రోజు హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేంద్ర నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణకు భారీ పెట్టుబడులు ఆకర్షించడం, విద్యా రంగంలో అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి 10 రోజుల విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఆగస్టు 20 నుంచి 30 వరకు బ్రిటన్, అమెరికాలో పర్యటించనున్న సీఎం.. ప్రముఖ విశ్వవిద్యాలయాలు, గ్లోబల్ సీఈవోలు, వెంచర్ క్యాపిటలిస్టులతో సమావేశం కానున్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వేర్వేరు కాదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పేదలకు సన్నబియ్యం అందించాలనే ఆలోచన చేయలేదని ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి పోలీసు దళాల గౌరవవందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ రైతు సంక్షేమం, జల హక్కులు, మహిళా సంక్షేమం, ప్రజావాణి, ఉద్యోగులు, డిజిటల్ కనెక్టివిటీ తదితర అంశాలపై కీలక ప్రకటనలు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరిగే లష్కర్ బోనాల మహోత్సవం ఘనంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు.
ఇంజినీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేయగా, పలువురు విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకుని టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
దేశ భవిష్యత్తు నిర్మాణంలో యువత పాత్రను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే కనిష్ఠ వయోపరిమితిని 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించేలా రాజ్యాంగ సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని తెలంగాణ శాసనసభలో ఆమోదించి కేంద్రానికి పంపనున్నట్లు వెల్లడించారు.