నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అంత్యక్రియలను పోలీసు లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అంత్యక్రియలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా వరంగల్ జిల్లా కలెక్టర్, వరంగల్ పోలీస్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు.
కలెక్టర్, పోలీస్ కమిషనర్‌కు ఆదేశాలు
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా కలెక్టర్, వరంగల్ పోలీస్ కమిషనర్ అంత్యక్రియలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు. పోలీసు లాంఛనాలతో అంతిమ వీడ్కోలు కార్యక్రమం ప్రశాంతంగా, గౌరవప్రదంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రభుత్వ గౌరవంతో వీడ్కోలు
పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రజాప్రతినిధిగా అందించిన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతో చివరి వీడ్కోలు పలికేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయనున్నాయి.




















