Google: గూగుల్‌లో అదిరిపోయే అప్‌డేట్స్.. నచ్చిన వార్తలనే ఇక చదవొచ్చు!

గూగుల్ సెర్చ్, డిస్కవర్, గూగుల్ న్యూస్‌లో వ్యక్తిగతీకరణకు మరింత ప్రాధాన్యం ఇస్తూ కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. పబ్లిషర్ల కోసం ‘Preferred Sources’ బటన్‌తో పాటు డిస్కవర్ ఫీడ్‌ను తమ అభిరుచులకు అనుగుణంగా మార్చుకునే కంట్రోల్స్, ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వ్యక్తిగతీకరించిన ఆడియో న్యూస్ బ్రీఫింగ్‌లను ప్రవేశపెట్టింది.

22 ఆగస్టు, 2026 12:44 PM•ByNarender Kumar Nangunoori

Share this article

Google: గూగుల్‌లో అదిరిపోయే అప్‌డేట్స్.. నచ్చిన వార్తలనే ఇక చదవొచ్చు!

Social Media Image

Google: టెక్ దిగ్గజం గూగుల్ తన సెర్చ్, డిస్కవర్, గూగుల్ న్యూస్ ప్లాట్‌ఫామ్‌లలో కీలక మార్పులు చేస్తోంది. యూజర్లు తమకు నచ్చిన వార్తా వనరులను ఎంచుకునేలా, అవసరం లేని కంటెంట్‌ను నియంత్రించుకునేలా కొత్త వ్యక్తిగతీకరణ ఫీచర్లను అందిస్తోంది.

పబ్లిషర్లకు ‘Preferred Sources’ బటన్

వార్తా పబ్లిషర్లు తమ వెబ్‌సైట్లలో ‘Preferred Sources’ అనే ఇంటరాక్టివ్ బటన్‌ను పొందుపరచుకోవచ్చు. పాఠకులు ఈ బటన్‌పై క్లిక్ చేస్తే ఆ వెబ్‌సైట్ గూగుల్‌లో వారి ప్రిఫర్డ్ సోర్స్‌గా యాడ్ అవుతుంది. దీంతో సంబంధిత వెబ్‌సైట్‌లో ప్రచురించే వార్తలు యూజర్ల డిస్కవర్ ఫీడ్‌లో మరింతగా కనిపిస్తాయి. అలాగే ప్రిఫర్డ్ సోర్సెస్‌గా ఎంపిక చేసిన సైట్ల కంటెంట్ టాప్ స్టోరీస్, ఏఐ ఓవర్‌వ్యూస్, ఏఐ మోడ్‌లోనూ కనిపించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే సుమారు 6 లక్షల మందికి పైగా యూజర్లు ఈ సదుపాయాన్ని ఉపయోగిస్తున్నారని గూగుల్ తెలిపింది. పబ్లిషర్లు గూగుల్ సెర్చ్ సెంట్రల్ డాక్యుమెంటేషన్ ద్వారా Preferred Sources బటన్ కోడ్‌ను పొందవచ్చు.

డిస్కవర్ ఫీడ్‌పై యూజర్లకే పూర్తి కంట్రోల్

గూగుల్ డిస్కవర్ ఫీడ్‌ను కూడా మరింత వ్యక్తిగతీకరించేలా కొత్త కంట్రోల్స్‌ను అందిస్తోంది. యూజర్లు తమకు నచ్చిన వెబ్‌సైట్ల వార్తలను ఎక్కువగా చూడాలా, తక్కువగా చూడాలా లేదా పూర్తిగా వద్దా అనే విషయాన్ని నిర్ణయించుకోవచ్చు. డిస్కవర్‌లో కనిపించే కంటెంట్‌పై మూడు చుక్కల మెనూను ట్యాప్ చేసి తమ అభిరుచిని గూగుల్‌కు తెలియజేయవచ్చు. అవసరమైతే సొంత మాటల్లో కూడా తమకు ఎలాంటి కంటెంట్ కావాలో చెప్పొచ్చు. ఆ తర్వాత డిస్కవర్ ఫీడ్ యూజర్ ఆసక్తులకు అనుగుణంగా మారుతుంది.

గూగుల్ న్యూస్‌లో ప్రత్యేక ఆడియో బ్రీఫింగ్‌లు

ఆండ్రాయిడ్‌లోని గూగుల్ న్యూస్ యాప్‌లో రోజువారీ ఆడియో న్యూస్ బ్రీఫింగ్‌లను కూడా మరింత వ్యక్తిగతీకరించుకోవచ్చు. యూజర్లు ముందుగానే తమకు కావాల్సిన వార్తా వనరులు, అంశాలను ఎంచుకోవచ్చు. దీంతో ప్రతిరోజూ తమకు ఆసక్తి ఉన్న వార్తలను ఆడియో రూపంలో వినే అవకాశం లభిస్తుంది. ప్రయాణంలో లేదా ఇతర పనులు చేసుకుంటూ వార్తలను తెలుసుకోవాలనుకునే వారికి ఈ ఫీచర్ ఉపయోగకరంగా ఉండనుంది. ఈ కొత్త ఫీచర్లు సెర్చ్‌లో దశలవారీగా అందుబాటులోకి వస్తున్నాయి.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు