పట్నం కుటుంబాన్ని పరామర్శించిన హరీశ్‌రావు సహా బీఆర్ఎస్ నేతలు

పట్నం కుటుంబంలో చోటుచేసుకున్న విషాద ఘటన నేపథ్యంలో బీఆర్ఎస్‌కు చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు షాబాద్‌లోని మాజీ జెడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రుక్కమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

28 జులై, 2026 1:59 PM•ByLaharika

Share this article

పట్నం కుటుంబాన్ని పరామర్శించిన హరీశ్‌రావు సహా బీఆర్ఎస్ నేతలు

రంగారెడ్డి జిల్లా షాబాద్‌లోని మాజీ జెడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి నివాసానికి బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు చేరుకుని పట్నం కుటుంబాన్ని పరామర్శించారు.

మాజీ మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా రుక్కమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

పట్నం మహేందర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, పట్నం అవినాష్ రెడ్డి, అలాగే కుటుంబ సభ్యులు సునీతా రెడ్డి, నీరజా రెడ్డి, సృతి రెడ్డి, పుల్ల నర్మదా రెడ్డి తదితరులను కలిసి ధైర్యం చెప్పారు. ఈ కష్టకాలంలో కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని పేర్కొంటూ తమ సంతాపాన్ని తెలియజేశారు.

గత వారం నిమ్స్ ఆస్పత్రిలో రుక్కమ్మను పరామర్శించినప్పుడు ఆమె ఉత్సాహంగా మాట్లాడారని మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గుర్తు చేశారు. ఆమె మృతి తీవ్ర విషాదాన్ని కలిగించిందని పేర్కొంటూ, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, మాణిక్ రావు, మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, మహేష్ రెడ్డి, ధర్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ బిందు, డీసీసీబీ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి, శ్రీనివాస్ యాదవ్, కొలన్ కృష్ణారెడ్డి, మాజీ జెడ్పీటీసీలు మహిపాల్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు