తెలంగాణ అసెంబ్లీ సమావేశాల మూడో రోజు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సభలో నిరసనకు దిగిన 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను స్పీకర్ ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు. కేటీఆర్, హరీష్‌రావు, జగదీష్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి తదితరులు సస్పెన్షన్‌కు గురయ్యారు.
తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మాజీ మంత్రి హరీశ్ రావు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. హరీశ్ రావు తీరుపై మండిపడ్డారు. ‘నా తల్లిని అన్నారు.. నీ తల్లిని అనలేదు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీ బయట తమపై పోలీసులు వ్యవహరించిన తీరుపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల ముసుగులో గూండాల్లా వ్యవహరించారేమోనని అనుమానం వ్యక్తం చేసిన ఆమె.. కేటీఆర్ లేకపోతే తమను కిందపడేసి తొక్కేవారని ఆరోపించారు.
పట్నం కుటుంబంలో చోటుచేసుకున్న విషాద ఘటన నేపథ్యంలో బీఆర్ఎస్‌కు చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు షాబాద్‌లోని మాజీ జెడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రుక్కమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.