హైదరాబాద్,సెప్టెంబర్ 16 (జనవాణి): తెలంగాణ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన భూముల వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. కల్వకుంట్ల కుటుంబానికి వివిధ జిల్లాల్లో వందల ఎకరాల భూములు ఉన్నాయని సీఎం సభలో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు.
తన కుటుంబానికి ఎక్కడో భూములు ఉన్నాయంటూ సీఎం అసెంబ్లీలో అబద్ధాలు చెప్పారని కవిత ఆరోపించారు. తనకు ఎలాంటి అక్రమ ఆస్తులు లేవని స్పష్టం చేశారు. తన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తుల కంటే ఒక్క గజం భూమి ఎక్కువగా ఉన్నట్లు నిరూపించినా ఆ భూమిని ప్రభుత్వానికే అప్పగిస్తానని మరోసారి ప్రకటించారు.
‘భూములపై సీబీఐ విచారణ జరపాలి’
భూముల విషయంలో వాస్తవాలు నిగ్గు తేలాలంటే సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని కవిత డిమాండ్ చేశారు. సీఎం సభలో ప్రస్తావించిన వ్యక్తుల భూములపై కూడా విచారణ జరపాలని కోరారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించిన కవిత.. సీఎం అసెంబ్లీలో భూముల వివరాలు వెల్లడిస్తున్న వీడియోను కూడా పోస్టు చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యులతో పాటు నవీన్ రావు, కొండల్ రావు తదితరుల భూములపై కూడా విచారణ జరిపితే అసలు వాస్తవాలు బయటకు వస్తాయని కవిత పేర్కొన్నారు.
కల్వకుంట్ల కుటుంబానికి 439 ఎకరాలు ఉన్నాయన్న సీఎం
మరోవైపు, కల్వకుంట్ల కుటుంబానికి తొమ్మిది జిల్లాల పరిధిలోని 24 మండలాలు, 31 గ్రామాల్లో సుమారు 439 ఎకరాల భూమి ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో పేర్కొన్నారు.
సీఎం వెల్లడించిన వివరాల ప్రకారం..

కేసీఆర్‌కు చెందిన ఫామ్‌హౌస్‌లో 700 ఎకరాల భూమి ఉందా? లేదా? అనే అంశంపై కూడా స్పష్టత రావాల్సి ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. అందులో ప్రభుత్వ భూమి ఉందని విచారణలో తేలితే, ఆ భూమిని నిరుపేద దళితులకు పంచుతామని ఆయన పేర్కొన్నారు.
జన్వాడ ఫామ్‌హౌస్ అంశాన్ని ప్రస్తావిస్తూ, తాను బాంబులు వేయడానికి బిన్ లాడెన్‌ను కాదంటూ కేటీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. భూముల వ్యవహారంపై సీఎం ఆరోపణలు, కవిత కౌంటర్‌తో తెలంగాణ రాజకీయాల్లో ఈ అంశం మరోసారి చర్చకు వచ్చింది.
Loading Tweet...




















