ఉజ్జయినీ మహంకాళి బోనాలకు మంత్రి శ్రీధర్‌బాబుకు ఆహ్వానం

సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆషాఢమాస బోనాల ఉత్సవాలకు హాజరుకావాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును ఆలయ పాలకమండలి సభ్యులు ఆహ్వానించారు. సచివాలయంలో మంత్రిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేసి బోనాల ప్రధాన కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు.

27 జులై, 2026 4:39 PM•ByLaharika

Share this article

ఉజ్జయినీ మహంకాళి బోనాలకు మంత్రి శ్రీధర్‌బాబుకు ఆహ్వానం

సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆషాఢమాస బోనాల ఉత్సవాల ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయ పాలకమండలి ప్రతినిధులు సోమవారం హైదరాబాద్ సచివాలయంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును మర్యాదపూర్వకంగా కలిసి బోనాల ఉత్సవాలకు ఆహ్వానించారు.

ఆగస్టు 2న నిర్వహించే బోనాల ప్రధాన ఉత్సవంతో పాటు ఆగస్టు 3న జరిగే రంగం, ధ్వజారోహణ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని మంత్రి శ్రీధర్‌బాబును కోరుతూ ఆలయ ప్రతినిధులు ఆహ్వాన పత్రికను అందజేశారు.

ఈ సందర్భంగా ఆలయ ఈవో మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు రామతీర్థ శర్మ, వేణుమాధవ శర్మ వేదమంత్రోచ్చారణలతో మంత్రికి ఆశీర్వచనాలు అందించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు దేవీవర ప్రసాద్, మంత్రి సోనాల్, మల్లిఖార్జున్, గంటా గీత, కిరణ్ ముప్పిడి తదితరులు పాల్గొన్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు