సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని బొల్లారం 20 బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ క్యాంప్‌లో జరిగిన ఆయుధాల చోరీ కేసులో పోలీసులు భారీ కుట్రను ఛేదించారు. బ్యాంకులు, జ్యువెలరీ షాపులు, సంపన్నుల ఇళ్లలో దోపిడీలకు ఈ ఆయుధాలను ఉపయోగించేందుకు పథకం రచించినట్లు దర్యాప్తులో తేలింది. కేసులో ముగ్గురు సర్వీసులో ఉన్న ఆర్మీ జవాన్లతో పాటు ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
గణేశ్ నిమజ్జనాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల పరిధిలో సెప్టెంబర్ 25న సెలవు ప్రకటించింది. ఈ మేరకు జీఏడీ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ సెలవుకు బదులుగా నవంబర్ 14ను పనిదినంగా నిర్ణయించింది.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న ‘తెలంగాణ విమోచన దినోత్సవం’ ఏర్పాట్లను కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి పరిశీలించారు. కేంద్ర సాయుధ బలగాల పరేడ్ రిహార్సల్స్, సాంస్కృతిక ప్రదర్శనల సన్నాహాలను వీక్షించిన ఆయన.. భద్రత, ట్రాఫిక్, వీఐపీ ప్రొటోకాల్ తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ బొల్లారంలోని మద్రాస్ రెజిమెంటల్ సెంటర్ ఆయుధాల చోరీ కేసును తెలంగాణ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఇటీవలే పదవీ విరమణ పొందిన హవల్దార్ ఉప్పుతోళ్ల మల్లేశ్‌ను గుర్తించినట్లు రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. రిటైర్మెంట్‌పై అసంతృప్తితో ముందస్తు ప్రణాళిక ప్రకారం ఆయుధాలు, మందుగుండు సామగ్రిని చోరీ చేసి.. వాటిని నాగర్‌కర్నూల్‌లోని తన స్వగ్రామం, యాప్రాల్‌లోని మరో ప్రాంతంలో పాతిపెట్టినట్లు పోలీసులు తెలిపారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని బొల్లారం 20 మద్రాస్ రెజిమెంట్ ఆయుధాగారం నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి చోరీ కేసులో అరెస్టులపై వస్తున్న వార్తలను తెలంగాణ పోలీసులు ఖండించారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ స్పష్టం చేశారు. మరోవైపు, రెజిమెంట్ సమీపంలో 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు లభించడంతో దర్యాప్తు మరింత కీలకంగా మారింది.
సికింద్రాబాద్ బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్‌లో జరిగిన అత్యాధునిక ఆయుధాల చోరీ ఘటనపై దర్యాప్తు ముమ్మరమైంది. చోరీ జరిగి నాలుగు రోజులు గడిచినా ఆయుధాల ఆచూకీ లభించకపోవడంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఉగ్రకుట్ర కోణంపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో NIA, IB, మిలిటరీ, స్థానిక పోలీసులు కలిసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆషాఢ బోనాల ఉత్సవాల్లో భాగంగా మంత్రి కొండా సురేఖ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మారుబోనం సమర్పించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీకగా నిలుస్తుందని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
సికింద్రాబాద్ నుంచి శామీర్‌పేట్ వరకు నిర్మించనున్న ప్రతిష్ఠాత్మక ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులో భాగంగా భూములు ఇచ్చిన అల్వాల్ భూయజమానులకు రూ.33 కోట్ల పరిహార చెక్కులను జిల్లా యంత్రాంగం అందజేసింది. మొత్తం 2,264 చదరపు గజాల భూమిని ప్రాజెక్టు కోసం సేకరించగా, సంబంధిత భూయజమానులకు పరిహారం చెల్లించినట్లు అధికారులు తెలిపారు.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో జరిగిన రంగం కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. కుంభవృష్టి వర్షాలు, అగ్నిప్రమాదాలు, ప్రాణనష్టం పెరిగే అవకాశముందని హెచ్చరించారు.
ఆషాఢ బోనాల ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీపీ సజ్జనార్ దంపతులు దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన... హైదరాబాద్‌లో బోనాలకు ఉన్న చారిత్రక ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తూ, భక్తుల భద్రతకు పోలీసులు పటిష్ఠమైన ఏర్పాట్లు చేశారని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరిగే లష్కర్ బోనాల మహోత్సవం ఘనంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా ఆగస్టు 2 నుంచి 4వ తేదీ తెల్లవారుజామున వరకు ఆలయం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. పలు రోడ్లను మూసివేయడంతో పాటు వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించనున్నారు. భక్తుల కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు, 175 ప్రత్యేక ఆర్టీసీ బస్సులను కూడా అందుబాటులో ఉంచారు.
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆషాఢమాస బోనాల ఉత్సవాలకు హాజరుకావాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును ఆలయ పాలకమండలి సభ్యులు ఆహ్వానించారు. సచివాలయంలో మంత్రిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేసి బోనాల ప్రధాన కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు.