సంతోష్‌కు కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి?..పదేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం అడ్డగోలుగా దోచుకుంది: రమ్యారావు తీవ్ర వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజా పాలనతో ప్రజల మద్దతు పొందుతుంటే బీఆర్ఎస్ ‘22ఏ’ పేరుతో రాజకీయాలు చేస్తోందని టీపీసీసీ సీనియర్ నేత రమ్యారావు విమర్శించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం అడ్డగోలుగా సంపాదించిందని ఆరోపించారు. తన భూములపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన ఆమె సంతోష్ రావు ఆస్తులు, భూములు, ప్లాట్లపై పలు ప్రశ్నలు సంధించారు.

21 సెప్టెంబర్, 2026 2:35 PM•ByNarender Kumar Nangunoori

Share this article

సంతోష్‌కు కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి?..పదేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం అడ్డగోలుగా దోచుకుంది: రమ్యారావు తీవ్ర వ్యాఖ్యలు

హైదరాబాద్,సెప్టెంబర్ 21 (జనవాణి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజా పాలనతో ప్రజల మద్దతు పొందుతుంటే బీఆర్ఎస్ ‘22ఏ’ పేరుతో రాజకీయాలు చేస్తోందని టీపీసీసీ సీనియర్ నేత రమ్యారావు మండిపడ్డారు. సోమవారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం అడ్డగోలుగా సంపాదించిందని ఆరోపించారు.

‘మా భూములు ఎక్కడున్నాయి?’

తమకు వందల ఎకరాల భూములు ఉన్నాయని కేటీఆర్ చేస్తున్న ఆరోపణలపై రమ్యారావు స్పందించారు. తాను కేసీఆర్ సొంత అన్న కుమార్తెనని, కేటీఆర్ చెబుతున్న వందల ఎకరాల్లో తమ భూములు ఎక్కడున్నాయో చెప్పాలని ప్రశ్నించారు. తాను, కవిత ఇద్దరం ఇంటి వాళ్లమని పేర్కొన్న రమ్యారావు.. సంబంధం లేని సంతోష్ రావు కేసీఆర్ వద్ద ఎందుకు కొనసాగుతున్నారని ప్రశ్నించారు. సంతోష్ రావు అడ్డగోలుగా సంపాదించారని తాను ఆరోపిస్తున్నా కేటీఆర్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని నిలదీశారు. సంతోష్ రావు కేటీఆర్‌కు బినామీనా? అని ప్రశ్నించారు.

సంతోష్ కుటుంబానికి 8 ప్లాట్లా?

2013లో సంతోష్ రావుకు క్వారీలో 25 శాతం వాటా ఉండేదని రమ్యారావు ఆరోపించారు. 2015లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులో ముంపునకు గురైందనే కారణంతో సంతోష్ కుటుంబ సభ్యులు ఇళ్ల పట్టాలు తీసుకున్నారని పేర్కొన్నారు. కుదురుపాక గ్రామానికి సంబంధం లేని వారు కూడా ప్లాట్లు పొందారని ఆరోపించారు. కుదురుపాకలో సంతోష్ రావు, ఆయన కుటుంబ సభ్యులు కలిసి ఎనిమిది ప్లాట్లు తీసుకున్నారని రమ్యారావు అన్నారు. 2018లో రాజ్యసభ అవకాశం వచ్చినప్పుడు సమర్పించిన అఫిడవిట్‌లో మాత్రం ఒక్క ప్లాట్‌నే చూపించారని ఆరోపించారు. ఎనిమిది ప్లాట్లు తీసుకుని ఒక్కదానినే అఫిడవిట్‌లో ఎలా చూపించారని ఆమె ప్రశ్నించారు.

‘కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి?’

కరీంనగర్‌లో ఉన్నప్పుడు సంతోష్ రావుకు చెప్పులు కూడా లేవని రమ్యారావు వ్యాఖ్యానించారు. ఇంట్లో పనిచేసే వ్యక్తి డబ్బును కూడా తీసుకున్నారని ఆరోపించారు. అలాంటి వ్యక్తికి ఇప్పుడు కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. మార్కుక్ గ్రామంలో తొమ్మిది ఎకరాల భూమి ఎలా వచ్చిందని, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో భూమి, ఇల్లు ఎలా సమకూరాయని ప్రశ్నించారు. కరీంనగర్‌లో సింగిల్ బెడ్‌రూమ్‌లో ఉన్న సంతోష్ రావుకు 2018 తర్వాత కొండాపూర్, బంజారాహిల్స్‌లో ఆస్తులు ఎలా వచ్చాయని రమ్యారావు నిలదీశారు. అక్కను, చెల్లిని ఇంటి నుంచి బయటకు పంపి సంతోష్ రావును ఎందుకు పక్కన పెట్టుకున్నారని కేటీఆర్‌ను ప్రశ్నించారు. సంతోష్ రావు భార్య రోహిణి పేరుతో నానక్‌రామ్‌గూడలో పెద్ద కమర్షియల్ భవనం ఎలా వచ్చిందో వివరించాలని డిమాండ్ చేశారు.

KCR Fsmily

గమనిక: పై కథనంలోని ఆస్తులు, భూములు, అక్రమాలపై ఆరోపణలు రమ్యారావు చేసినవిగా మాత్రమే పేర్కొంటున్నాం; వాటి స్వతంత్ర ధృవీకరణ ఈ కథనంలో లేదు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు