పేదల కోసం పథకాలు.. ప్రజలకు చేరేలా ఉద్యోగులు పనిచేయాలి: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

కరీంనగర్‌ జిల్లాలో పర్యటించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కొత్త కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని ప్రారంభించడంతో పాటు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. పేదలకు సంక్షేమ పథకాలు చేరేలా అధికారులు పనిచేయాలని సూచించారు.

30 సెప్టెంబర్, 2026 5:14 PM•ByNarender Kumar Nangunoori

Share this article

పేదల కోసం పథకాలు.. ప్రజలకు చేరేలా ఉద్యోగులు పనిచేయాలి: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

కరీంనగర్‌,సెప్టెంబర్ 30 (జనవాణి): పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందేలా అధికారులు పనిచేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం కరీంనగర్‌ జిల్లాలో పర్యటించిన సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

కరీంనగర్‌లో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్‌ ఎదుట ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అలాగే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతినిధులని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేసే బాధ్యత అధికారులదేనని పేర్కొన్నారు.

ప్రజలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తున్నామని, ఇంకా పరిష్కరించాల్సిన సమస్యలను కూడా దశలవారీగా పరిష్కరిస్తామని సీఎం వెల్లడించారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు