సీఎం రేవంత్‌రెడ్డికి ప్రతిష్టాత్మక పురస్కారం.. ‘బెస్ట్ పబ్లిక్ సర్వెంట్-2026’ అవార్డు

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి ప్రతిష్టాత్మక ఆర్యదాన్ మహమ్మద్-2026 బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ అవార్డు దక్కనుంది. రైతులు, బీసీలు, సామాన్య ప్రజల కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, ప్రజాస్వామిక విలువల పట్ల ఆయన నిబద్ధతను గుర్తిస్తూ ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు నిర్వాహకుల జ్యూరీ వెల్లడించింది.

24 సెప్టెంబర్, 2026 8:11 PM•ByNarender Kumar Nangunoori

Share this article

సీఎం రేవంత్‌రెడ్డికి ప్రతిష్టాత్మక పురస్కారం.. ‘బెస్ట్ పబ్లిక్ సర్వెంట్-2026’ అవార్డు

హైదరాబాద్, సెప్టెంబర్ 24 (జనవాణి): తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి ప్రతిష్టాత్మక పురస్కారం దక్కనుంది. ఆర్యదాన్ మహమ్మద్-2026 అవార్డుల్లో భాగంగా ఈ ఏడాది బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ అవార్డుకు సీఎం రేవంత్‌రెడ్డి ఎంపికయ్యారు. కేరళలోని నిలంబూరులో శుక్రవారం జరిగే కార్యక్రమంలో ఆయనకు ఈ పురస్కారాన్ని నిర్వాహకులు ప్రదానం చేయనున్నారు.

రేవంత్‌రెడ్డి పాలనలో రైతులు, బీసీలు, సామాన్య పౌరుల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు జ్యూరీ తెలిపింది. అలాగే ప్రజాస్వామిక విలువల పట్ల సీఎం రేవంత్‌రెడ్డి చూపుతున్న నిబద్ధతను జ్యూరీ ప్రశంసించింది.

కేరళకు చెందిన దివంగత కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్యదాన్ మహమ్మద్ స్మారకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. ఆయన నాలుగో వర్ధంతి సందర్భంగా శుక్రవారం నిలంబూరులో అవార్డు ప్రదానోత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డికి ‘బెస్ట్ పబ్లిక్ సర్వెంట్-2026’ అవార్డును అందజేయనున్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు