పోలీసుల ముసుగులో గూండాలు దాడి చేశారని అనుమానముంది.. సబితా ఇంద్రారెడ్డి

అసెంబ్లీ బయట తమపై పోలీసులు వ్యవహరించిన తీరుపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల ముసుగులో గూండాల్లా వ్యవహరించారేమోనని అనుమానం వ్యక్తం చేసిన ఆమె.. కేటీఆర్ లేకపోతే తమను కిందపడేసి తొక్కేవారని ఆరోపించారు.

7 సెప్టెంబర్, 2026 2:09 PM•ByNarender Kumar Nangunoori

Share this article

పోలీసుల ముసుగులో గూండాలు దాడి చేశారని అనుమానముంది.. సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 7 (జనవాణి): అసెంబ్లీ బయట జరిగిన ఘటనపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా స్పందించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె రేవంత్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ బయట పోలీసులు అతిగా ప్రవర్తించారు. పోలీసుల ముసుగులో గూండాలు మాపై వ్యవహరించారేమోనని అనుమానం కలుగుతోంది అని సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. తమ ఎమ్మెల్యేలు ధరించిన నల్ల టీషర్టులపై అభ్యంతరకరమైన పదాలు ఏమీ లేవని స్పష్టం చేశారు.

మహిళా నాయకురాలు సునీతా లక్ష్మారెడ్డి చీర పట్టుకుని లాగారని, తన గొంతు, జుట్టు పట్టుకుని లాగారని సబిత ఆరోపించారు. కేటీఆర్ లేకపోతే తమను కిందపడేసి తొక్కేవారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని గొంతు పట్టుకుని పిసికేస్తున్నారని ఆమె మండిపడ్డారు. పాలిటెక్నిక్ విద్యార్థులు ప్రశ్నించినప్పుడు కూడా ఇదే తరహాలో వ్యవహరించారని ఆరోపించారు.

వెయ్యి రోజుల పాలనపై ఇచ్చిన హామీలను అమలు చేయాలని తాము ప్రశ్నించామని, అయితే అసెంబ్లీలోకి వెళ్లకుండా గేటు వద్దే అడ్డుకున్నారని సబిత తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని సంతృప్తి పరచేందుకే పోలీసులు ఇలా వ్యవహరించారని ఆరోపించారు. అలాగే ప్రధాని మోదీ, అదానీ బొమ్మలున్న టీషర్టులు ధరించి రాహుల్‌ గాంధీ పార్లమెంట్‌కు వెళ్లారని, అక్కడ ఒక న్యాయం.. తెలంగాణలో మరో న్యాయం ఉంటుందా? అని ప్రశ్నించారు. ఘటనను ఖండించాల్సిన మంత్రి సీతక్క ‘డ్రామాలు’ అంటూ వ్యాఖ్యానించడం బాధాకరమని సబితా ఇంద్రారెడ్డి అన్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు