దోమల నివారణకు ప్రత్యేక మాన్సూన్‌ డ్రైవ్‌.. ప్రతి శుక్రవారం ‘ఫ్రైడే–డ్రైడే’ పాటించాలి: మంత్రి పొన్నం

హైదరాబాద్ నగరంలో దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను అరికట్టేందుకు జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ప్రత్యేక మాన్సూన్‌ డ్రైవ్‌ చేపట్టనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ఆగస్టు 11 నుంచి 21 వరకు నిర్వహించే ఈ డ్రైవ్‌లో భాగంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐఈసీ (ఇన్ఫర్మేషన్‌, ఎడ్యుకేషన్‌, కమ్యూనికేషన్‌) కార్యక్రమాన్ని శనివారం మినిస్టర్‌ క్వార్టర్స్‌లో ప్రారంభించారు.

8 ఆగస్టు, 2026 5:09 PM•ByRalin

Share this article

దోమల నివారణకు ప్రత్యేక మాన్సూన్‌ డ్రైవ్‌.. ప్రతి శుక్రవారం ‘ఫ్రైడే–డ్రైడే’ పాటించాలి: మంత్రి పొన్నం

మినిస్టర్స్ క్వార్టర్స్‌లో ప్రారంభించిన ఐఈసీ కార్యక్రమంలో దోమల నివారణకు వినియోగిస్తున్న పరికరాలను పరిశీలిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్‌, ఆగస్టు 8(జనవాణి): హైదరాబాద్ నగరంలో దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను అరికట్టేందుకు జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ప్రత్యేక మాన్సూన్‌ డ్రైవ్‌ చేపట్టనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ఆగస్టు 11 నుంచి 21 వరకు నిర్వహించే ఈ డ్రైవ్‌లో భాగంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐఈసీ (ఇన్ఫర్మేషన్‌, ఎడ్యుకేషన్‌, కమ్యూనికేషన్‌) కార్యక్రమాన్ని శనివారం మినిస్టర్‌ క్వార్టర్స్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా దోమల నివారణకు ఉపయోగిస్తున్న పరికరాలను పరిశీలించిన మంత్రి.. వాటి పనితీరు, వినియోగంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ప్రజలు ప్రతి శుక్రవారం ‘ఫ్రైడే–డ్రైడే’ పాటించాలని మంత్రి సూచించారు. ఇళ్లలో, పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం ద్వారా దోమల లార్వా వృద్ధిని అరికట్టవచ్చన్నారు. డెంగ్యూ వంటి వ్యాధులు రాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందని, ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.

ఇంటింటికీ అవగాహన

మాన్సూన్‌ డ్రైవ్‌లో భాగంగా ఇంటింటికీ వెళ్లి ప్రజలకు దోమల నివారణపై అవగాహన కల్పించనున్నారు. దోమల లార్వాలు వృద్ధి చెందే ప్రాంతాలను గుర్తించి యాంటీ లార్వా ఆపరేషన్లు చేపట్టడంతో పాటు జీహెచ్‌ఎంసీ పరిధిలో విస్తృతంగా ఫాగింగ్‌ నిర్వహించనున్నారు. కరపత్రాల పంపిణీ, పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో ఎక్కడైనా నీరు నిలిచి ఉంటే వెంటనే తొలగించేలా ప్రజలకు సూచనలు ఇవ్వనున్నారు.

వ్యాధులు రాకుండా జాగ్రత్తలు

జీహెచ్‌ఎంసీ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డా. అమర్‌సింగ్‌ నాయక్‌ మాట్లాడుతూ.. ‘ఫ్రైడే–డ్రైడే’లో భాగంగా ఇంటింటికీ వెళ్లి ఐఈసీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దోమల నియంత్రణ, డెంగ్యూ, టైఫాయిడ్‌, చికున్‌గున్యా వంటి వ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఇళ్లలో, పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. లార్వాలు కనిపిస్తే నీటిని వెంటనే తొలగించాలని కోరారు. కార్యక్రమంలో ఎంటమాలజీ, శానిటేషన్ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు