అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారు.. సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం

సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో అసెంబ్లీ సమావేశాలతో పాటు నియోజకవర్గాల అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ పనులపై సీఎం కీలక సూచనలు చేశారు.

25 ఆగస్టు, 2026 12:54 PM•ByNarender Kumar Nangunoori

Share this article

అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారు.. సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం

హైదరాబాద్, ఆగస్టు 25 (జనవాణి): తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నిర్వహించిన సమావేశంలో వెల్లడించారు. సచివాలయంలో అందుబాటులో ఉన్న ప్రజాప్రతినిధులతో సమావేశమైన సీఎం.. పలు కీలక అంశాలపై చర్చించారు.

ప్రత్యేకంగా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ పనులను వేగంగా పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. భూసేకరణలో నిర్లక్ష్యం చేస్తే ప్రాజెక్టులు ఎప్పటికీ పూర్తికావని ఆయన స్పష్టం చేశారు. భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ (పునరావాసం, పునరావాస పునరుద్ధరణ), అటవీ అనుమతులకు సంబంధించిన నిధులను వెంటనే మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం తెలిపారు. ఆయా పనులను సమన్వయంతో పూర్తి చేసి ప్రాజెక్టుల పురోగతికి అడ్డంకులు తొలగించాలని సూచించారు. ప్రతి ప్రజాప్రతినిధి తమ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డి సూచించారు. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను గుర్తించి వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Assembly Meeting

ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, విప్‌లు ఆది శ్రీనివాస్, రామచంద్ర నాయక్, బీర్ల ఐలయ్య, వేముల వీరేశంతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య పాల్గొన్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు