తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో వరుణ యాగం..ముహూర్తం ఖరారు

తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, కృష్ణా-గోదావరి నదులు జలకళ సంతరించుకోవాలని, రైతాంగం సుభిక్షంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం వరుణ యాగం నిర్వహించనుంది.

7 ఆగస్టు, 2026 11:15 AM•ByNarender Kumar Nangunoori

Share this article

తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో వరుణ యాగం..ముహూర్తం ఖరారు

Janavaani Image

హైదరాబాద్, ఆగస్టు 07 (జనవాణి) : రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి, వ్యవసాయం సమృద్ధిగా సాగాలని ఆకాంక్షిస్తూ కృష్ణా-గోదావరి నదులు, జలాశయాలు పుష్కలంగా నిండాలని తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక వరుణ యాగం నిర్వహించేందుకు నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఆగస్టు 10వ తేదీన ఈ మహా యాగం నిర్వహించనున్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ విజయ విహార్ ప్రాంగణంలో ఈ యాగం వైభవంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చెందిన వేదపండితులు, అర్చకుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా ఈ యాగ క్రతువు నిర్వహించబడుతుంది.

ఈ మహా యాగంలో 108 మంది ఋత్వికులు, 11 హోమకుండాలు ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఎల్‌నినో ప్రభావం తగ్గి రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలనే సంకల్పంతో ప్రత్యేక హోమాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో జరిగే ఈ యాగంలో పూర్ణాహుతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. రైతాంగ శ్రేయస్సు, రాష్ట్ర సుభిక్షం, కృష్ణా-గోదావరి నదుల్లో సమృద్ధిగా జలాలు ప్రవహించాలనే లక్ష్యంతో ఈ మహా వరుణ యాగాన్ని నిర్వహిస్తున్నట్లు యాదగిరిగుట్ట దేవస్థానం పాలక మండలి చైర్మన్ ఓ ప్రకటన విడుదల చేశారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు