హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జనం.. ఈ జిల్లాల్లో సెప్టెంబర్‌ 25న సెలవు

గణేశ్‌ నిమజ్జనాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాల పరిధిలో సెప్టెంబర్‌ 25న సెలవు ప్రకటించింది. ఈ మేరకు జీఏడీ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ సెలవుకు బదులుగా నవంబర్‌ 14ను పనిదినంగా నిర్ణయించింది.

23 సెప్టెంబర్, 2026 7:06 PM•ByNarender Kumar Nangunoori

Share this article

హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జనం.. ఈ జిల్లాల్లో సెప్టెంబర్‌ 25న సెలవు

హైదరాబాద్,సెప్టెంబర్ 23 (జనవాణి): గణేశ్‌ నిమజ్జనాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్‌ 25వ తేదీ శుక్రవారం సెలవు ప్రకటించింది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాలతో పాటు వాటి పరిసర ప్రాంతాల్లోని రంగారెడ్డి, మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాల పరిధిలో ఈ సెలవు వర్తించనుంది.

ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గణేశ్‌ నిమజ్జన ఊరేగింపులు, భారీగా తరలివచ్చే భక్తులు, ట్రాఫిక్‌ నియంత్రణ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

సెప్టెంబర్‌ 25న సంబంధిత ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు సెలవు ఉంటుంది. అయితే ఈ సెలవుకు బదులుగా నవంబర్‌ 14 (రెండో శనివారం)ను పనిదినంగా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో సెప్టెంబర్‌ 25న సెలవు పొందే సంబంధిత సంస్థలు నవంబర్‌ 14న యథావిధిగా పనిచేయాల్సి ఉంటుంది.

ఇప్పటికే 2025 డిసెంబర్‌ 6న జారీ చేసిన సెలవుల ఉత్తర్వులను పాక్షికంగా సవరిస్తూ ప్రభుత్వం తాజాగా జీఓఆర్టీ నంబర్‌ 1396ను విడుదల చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు ఈ ఉత్తర్వులు జారీ చేశారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు