రూ.1.93 కోట్ల కరెన్సీ నోట్లతో కొలువుదీరిన కరెన్సీ గణపయ్య

వరంగల్ శివనగర్ వాసవికాలనీలోని వినాయక ట్రస్టు భవన్‌లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈసారి గణపతిని ఏకంగా రూ.1.93 కోట్ల విలువైన వివిధ రంగుల కరెన్సీ నోట్లతో అలంకరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గతేడాది రూ.1.51 కోట్ల కరెన్సీతో అలంకరించగా.. ఈసారి మరో రూ.42 లక్షల విలువైన నోట్లను అదనంగా వినియోగించారు.

21 సెప్టెంబర్, 2026 5:47 PM•ByNarender Kumar Nangunoori

Share this article

రూ.1.93 కోట్ల కరెన్సీ నోట్లతో కొలువుదీరిన కరెన్సీ గణపయ్య

వరంగల్,సెప్టెంబర్ 21 (జనవాణి): వరంగల్ శివనగర్ వాసవికాలనీలోని వినాయక ట్రస్టు భవన్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇక్కడ ప్రతిష్ఠించిన గణపతి విగ్రహాన్ని నిర్వాహకులు, భక్తులు కలిసి వినూత్నంగా అలంకరించారు.

గణపతికి వివిధ రంగుల కరెన్సీ నోట్లతో రూ.1.93 కోట్ల విలువైన అలంకరణ చేశారు. దీంతో కరెన్సీ గణపతి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. గత ఏడాది రూ.1.51 కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించగా ఈసారి అదనంగా రూ.42 లక్షల విలువైన నోట్లను వినియోగించారు.

తమ వ్యాపారాలు మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ భక్తులు కరెన్సీ గణపతికి ప్రత్యేకంగా లక్ష్మీగణపతి పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భారీ మొత్తంలో నగదు ఉండటంతో మండపం వద్ద నిర్వాహకులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

మండపం పరిసరాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందిని నియమించారు. రూ.కోట్ల విలువైన కరెన్సీతో అలంకరించిన ఈ గణపతి విగ్రహం ప్రస్తుతం వరంగల్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు