పితృ పక్షంలో పూర్వీకులను స్మరించుకుంటూ శ్రాద్ధం, తర్పణం, పిండదానం చేయడం హిందూ సంప్రదాయంలో ముఖ్యమైన ఆచారంగా భావిస్తారు. ముఖ్యంగా బీహార్‌లోని గయ క్షేత్రంలో పిండదానానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. గయలో భక్తిశ్రద్ధలతో పిండదానం చేస్తే ఏడు తరాల పితృదేవతలకు మోక్షం లభిస్తుందని మత విశ్వాసం. విష్ణుపాద ఆలయం, ఫల్గు నది, రామాయణంతో ముడిపడిన కథనాలు గయను పితృ తీర్థంగా ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఎంతో ప్రాధాన్యత ఉన్న విష్ణుపాద క్షేత్రం ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మతిమరుపుతో తీర్థయాత్ర బృందం నుంచి తప్పిపోయి పొరపాటున బీహార్ రైలు ఎక్కిన పంజాబ్‌కు చెందిన వృద్ధుడు చమన్ లాల్.. ఏకంగా 1,200 కిలోమీటర్ల దూరంలోని గయాకు చేరుకున్నాడు. ఆకలితో, ఆందోళనతో ఉన్న ఆయనకు నీరజ్ అనే స్థానికుడు ఆశ్రయం కల్పించాడు. వృద్ధుడు చెప్పిన గ్రామం ఆచూకీ కోసం చాట్‌జీపీటీని ఆశ్రయించిన నీరజ్ సాంకేతికత సాయంతో ఆయన కుటుంబాన్ని గుర్తించి తిరిగి కలిపాడు.
బెంగళూరుకు చెందిన A1 స్పోర్ట్స్ వరల్డ్ స్టార్టప్ తీసుకున్న ఓ నియామక నిర్ణయం తీవ్ర చర్చకు దారితీసింది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పురుష అభ్యర్థులను ఇకపై ఉద్యోగాల్లోకి తీసుకోబోమని సంస్థ వ్యవస్థాపకుడు కార్తీక్ ఎస్‌జీ ప్రకటించారు.
బీహార్‌లోని జమూయ్ జిల్లాలో పదో తరగతి చదువుతున్న ఇద్దరు మైనర్ విద్యార్థులపై ఓ గుంపు దురుసుగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపుతోంది. సెప్టెంబర్ 19న కోచింగ్ ముగించుకుని స్కూటర్‌పై వెళ్తున్న విద్యార్థులను అడ్డుకుని వేధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
పరీక్షల్లో తక్కువ మార్కులు సాధించిన విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయకుండా బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 10, 12వ తరగతి విద్యార్థుల మార్క్‌షీట్లలో ‘Fail’ అనే పదాన్ని ఉపయోగించకూడదని నిర్ణయించింది.
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన తొలి ప్రత్యక్ష ఎన్నికల్లోనే సంచలన విజయం సాధించారు. బిహార్‌లోని బంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థిపై 20 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలిచి, మూడు దశాబ్దాలుగా బీజేపీ ఆధిపత్యం కొనసాగిన నియోజకవర్గాన్ని కైవసం చేసుకున్నారు.