న్యూఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ సదస్సుకు వచ్చే దేశాధినేతలు, ప్రముఖ అతిథుల కోసం జైపూర్‌కు చెందిన అరుణ్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రత్యేక వెండి పూత పాత్రలను సిద్ధం చేసింది. భారతీయ సంప్రదాయం, ఆధునిక డిజైన్ల కలయికతో రూపొందించిన ఈ పాత్రలు గతంలో G20 సదస్సులోనూ ఉపయోగించారు.
భారత్ అధ్యక్షతన జరుగుతున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026కు ఏకగ్రీవ ఆమోదం లభించింది. సభ్య దేశాల మధ్య సున్నితమైన భౌగోళిక రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, ఏకాభిప్రాయాన్ని సాధించడంలో భారత్ కీలక పాత్ర పోషించింది. తెల్లవారుజాము వరకు సాగిన చర్చల అనంతరం అన్ని దేశాలు డిక్లరేషన్‌కు అంగీకరించడం భారత్ దౌత్య విజయంగా నిలిచింది.
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఏడేళ్ల తర్వాత భారత్‌లో అడుగుపెట్టారు. 18వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు శనివారం ఢిల్లీకి చేరుకున్న ఆయన.. ప్రధాని నరేంద్ర మోదీతో కీలక ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొననున్నారు.
ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించనున్నారు. న్యూఢిల్లీలో సెప్టెంబర్ 12, 13 తేదీల్లో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు జిన్‌పింగ్ హాజరుకానున్నారు. 2020 గల్వాన్ ఘర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.