వరంగల్ కాంగ్రెస్ రాజకీయాల్లో మాజీ మంత్రి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తనను, తన అనుచరులను ఉద్దేశించి ఇష్టానుసారంగా మాట్లాడే నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని ఆమె హెచ్చరించారు. లేదంటే మహిళా కార్యకర్తలతో గట్టిగా సమాధానం చెప్పిస్తామని వ్యాఖ్యానించారు.
ఛత్తీస్‌గఢ్‌లో 2013లో జరిగిన జీరమ్ వ్యాలీ మావోయిస్టు దాడి కేసులో జగదల్‌పూర్ ప్రత్యేక NIA కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ముగ్గురు మహిళలు సహా మొత్తం 10 మందిని దోషులుగా నిర్ధారించింది. దోషులకు విధించే శిక్షను సెప్టెంబర్ 16న ప్రకటించనుంది.
తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలపై మరోసారి చర్చ మొదలైంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. సమయం వచ్చినప్పుడు తనకు వచ్చే పదవిని ఎవరూ అడ్డుకోలేరని, సీఎం అయ్యే అవకాశం వస్తే బ్రహ్మదేవుడు కూడా తనను ఆపలేడని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతలు పాత కాంగ్రెస్ కార్యకర్తలను పక్కనబెట్టి పార్టీని తమ ఆధీనంలోకి తీసుకోవాలని చూస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ బ్రాండేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేసే నేతలు ఆ పార్టీ చరిత్ర, త్యాగాల గురించి తెలుసుకోవాలని సూచించారు.
సీఎం రేవంత్‌రెడ్డిపై ఎవరైనా ఇష్టానుసారం మాట్లాడితే సహించేది లేదని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హెచ్చరించారు. పార్టీ, ప్రభుత్వానికి నష్టం కలిగించే వ్యాఖ్యలు చేస్తున్న వారిపై కాంగ్రెస్ అధిష్ఠానం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కొండా కుటుంబ సభ్యులు చేసిన వ్యాఖ్యలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరారు.