గుంటూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. డయాలసిస్ కోసం కొడుకుతో కలిసి కారులో ఆసుపత్రికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో అకస్మాత్తుగా కారులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో వెనుక సీటులో ఉన్న హరికృష్ణ మంటల్లో చిక్కుకుని మృతి చెందారు. కారు నడుపుతున్న ఆయన కుమారుడు అఖిలేష్ స్థానికుల సాయంతో బయటపడి స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు.
రాజస్థాన్‌లోని జైపూర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సీతాపుర ప్రాంతంలోని బాలాజీ మార్కెట్‌లో ఉన్న ఓ మెర్సిడెస్ బెంజ్ కార్ల వర్క్‌షాప్‌లో మంగళవారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో సుమారు 8 లగ్జరీ కార్లు, కార్ల విడిభాగాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో మరిన్ని కార్లు మంటలకు ఆహుతి కాకుండా కాపాడారు.
ఆదిలాబాద్ రిమ్స్ దవాఖానలో సోమవారం అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నవజాత శిశువుల ఎస్‌ఎన్‌సీయూ వార్డులో ఏసీ వద్ద షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగతో ఊపిరాడక ముగ్గురు పసికందులు మృతిచెందారు. మరో చిన్నారుల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
మహారాష్ట్రలోని అమరావతి జిల్లా ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున సుమారు 3.30 గంటలకు మూడో అంతస్తులోని నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU)లో మంటలు చెలరేగాయి.
కోల్‌కతాలోని న్యూమార్కెట్ ప్రాంతంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫ్రీ స్కూల్ వీధిలోని ఓ హోటల్‌లో అర్ధరాత్రి మంటలు చెలరేగడంతో చిన్నారి సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా బంగ్లాదేశీయులేనని అధికారులు తెలిపారు.
హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 11లోని బీఆర్కే న్యూస్ భవనం సెల్లార్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. 11 మందిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా రక్షించగా, వైన్ స్టోరేజీలో భారీ నష్టం జరిగింది.