మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో సినిమా వస్తే అది టాలీవుడ్‌లోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా నిలిచే అవకాశం ఉంది. ఈ ఇద్దరు అగ్ర హీరోలను ఒకే ఫ్రేమ్‌లో చూపించాలని తాను కోరుకుంటున్నట్లు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెలిపారు. అవకాశం వస్తే అంతకంటే అదృష్టం మరొకటి ఉండదని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రామ్‌చరణ్‌తో ‘పెద్ది’ తెరకెక్కించిన దర్శకుడు బుచ్చిబాబు తన తదుపరి సినిమాను మెగాస్టార్ చిరంజీవితో చేయనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చిరంజీవి కోసం బుచ్చిబాబు రా అండ్ రస్టిక్ నేపథ్యంలో ఓ కథ సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ భారీ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి వారికి ఘన నివాళులర్పించారు. సత్యం, అహింసతో గాంధీజీ అందించిన పోరాట స్ఫూర్తిని, ‘జై జవాన్–జై కిసాన్’ నినాదంతో శాస్త్రి చూపిన దేశభక్తిని గుర్తుచేసుకుంటూ ఎక్స్ వేదికగా భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు.
అరేబియా సముద్రంలో భారీ డ్రగ్స్ అక్రమ రవాణా గుట్టురట్టయింది. భారత తీరరక్షక దళం, గుజరాత్ ఏటీఎస్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఇరాన్‌కు చెందిన పడవ నుంచి 526 కిలోల మెథాంఫెటామైన్, హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.3,000 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పడవలో ఉన్న ఐదుగురు పాకిస్థాన్ జాతీయులను అదుపులోకి తీసుకున్నారు.
వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని ప్రసిద్ధ శ్రీరంగనాథ స్వామి ఆలయ సముదాయంలో చోరీ కలకలం రేపింది. రాములవారి గుడిలోని శ్రీరాముడు, లక్ష్మణుడు, ఆంజనేయస్వామి పంచలోహ విగ్రహాలను గుర్తుతెలియని దుండగులు అపహరించినట్లు ఆలయ వర్గాలు గుర్తించాయి.
ఖైరతాబాద్ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి కిరణ్ పేరును ఖరారు చేసినట్లు సమాచారం. అలాగే వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్ రెడ్డిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే పార్టీ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ‘సిగ్మా’ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ఈ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ అక్టోబర్ 2న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో జరగనున్న తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
మెగాస్టార్ చిరంజీవి సినీ రంగ ప్రవేశం చేసి 48 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన తనయుడు, హీరో రామ్‌చరణ్ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. చిరంజీవి సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకున్న చరణ్.. 50 ఏళ్ల మైలురాయిని కలిసి జరుపుకునే రోజు కోసం ఎదురుచూస్తున్నానని తెలిపారు.
బీజేపీలో కీలక సంస్థాగత మార్పులు చోటుచేసుకున్నాయి. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలకు పార్టీ ఇన్‌ఛార్జ్‌లు, కో-ఇన్‌ఛార్జ్‌లను అధిష్ఠానం నియమించింది. తెలంగాణ, పశ్చిమ బెంగాల్ బాధ్యతలను సునీల్ బన్సల్‌కు అప్పగించగా.. తెలంగాణకు అభయ్ పాటిల్, రేఖా శర్మలను కో-ఇన్‌ఛార్జ్‌లుగా నియమించింది.
బ్లడ్ బ్యాంక్ పేరుతో రక్తం విక్రయిస్తున్నారంటూ తనపై వస్తున్న ఆరోపణలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. సినిమాల ద్వారా వస్తున్న తన సంపాదన తనకు సరిపోతుందని, రక్తం అమ్ముకోవాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. తన కష్టార్జితంతోనే బ్లడ్ బ్యాంక్‌ను నిర్వహిస్తున్నానని తెలిపారు. జీవితంలో ఎదగడానికి క్రమశిక్షణ, కష్టపడే తత్వమే కారణమని, ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలని అభిమానులకు సూచించారు.
స్వేచ్ఛ కోసం సాగిన ఉద్యమాల్లో తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రత్యేక స్థానం ఉంది. నిజాం నిరంకుశ పాలన, భూస్వామ్య దోపిడీ, వెట్టిచాకిరీ, అక్రమ పన్నులు, రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా రైతులు, కూలీలు, సామాన్య ప్రజలు తిరుగుబాటు చేశారు. ఈ పోరాటానికి ఉమ్మడి వరంగల్ జిల్లా కీలక కేంద్రంగా నిలిచింది. కడవెండిలో దొడ్డి కొమురయ్య అమరత్వం నుంచి వరంగల్ కోటపై జాతీయ జెండా ఎగురవేసిన బత్తిని మొగిలయ్య వరకు.. పాలకుర్తి, పరకాల, బైరాన్‌పల్లి వంటి ప్రాంతాల్లో జరిగిన ఘటనలు తెలంగాణ చరిత్రలో చెరగని ముద్ర వేశాయి. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఉమ్మడి వరంగల్ గడ్డపై సాగిన ఆ పోరాట పథాన్ని గుర్తుచేసుకుందాం.
మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ‘కాకా’ చిత్రంలో నటిస్తున్న చిరు.. ఆ తర్వాత ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ చేయనున్నారు. నేచురల్ స్టార్ నాని నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్‌ను వచ్చే ఏడాది మార్చి నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం.
సినిమా చిన్నదా.. పెద్దదా అని చూడకుండా మంచి విజయం సాధించిన చిత్రాలను అభినందించడం మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకత. తాజాగా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకున్న ‘ఇరుముడి’ చిత్రబృందాన్ని చిరంజీవి, రామ్ చరణ్ ప్రత్యేకంగా అభినందించారు. చిత్రబృందాన్ని ఇంటికి ఆహ్వానించి ఆప్యాయంగా ముచ్చటించిన మెగా హీరోల ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గోదావరి జిల్లాల్లో ఎంతో క్రేజ్ ఉన్న పులస చేప మెగాస్టార్ చిరంజీవి ఇంటికి చేరింది. కోటిపల్లి గోదావరిలో మత్స్యకారుల వలకు చిక్కిన కేజీన్నర బరువున్న పులసను యానాం మార్కెట్‌లో రూ.20 వేలకు కొనుగోలు చేసి, ఓ వ్యక్తి చిరంజీవికి బహుమతిగా పంపించినట్లు మత్స్యకారులు తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవి కుమార్తె, సినీ నిర్మాత కొణిదెల సుస్మితకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ట్రస్ట్ బోర్డులో ఆమెను ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియమించింది.
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత తీసుకోవాలని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. ఈ వినాయక చవితికి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా సీడ్ గణేశుడిని పూజించాలని సూచించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపొందించిన సీడ్ గణేశా ప్రతిమలను తన నివాసంలో ఆవిష్కరించిన చిరంజీవి.. పూజ అనంతరం ఇంట్లోనే నిమజ్జనం చేస్తే వినాయకుడు మొక్కగా మారి మనల్ని ఆశీర్వదిస్తాడని చెప్పారు.
మెగాస్టార్ చిరంజీవి ‘ఇరుముడి’ సినిమాపై ప్రశంసలు కురిపించారు. రవితేజ నటన, శివ నిర్వాణ దర్శకత్వంతో పాటు చిత్ర బృందాన్ని అభినందించారు. అయితే చివర్లో “ఈ పరిశ్రమ అందరిదీ.. ఏ కొందరిదో కాదు. మనం బతకాలి.. ఇతరులనూ బతికించాలి” అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చకు దారితీశాయి.
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణ రావు (73) కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 100కు పైగా చిత్రాల్లో నటించిన జీవీ నారాయణ రావు మృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది.
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. మహారాష్ట్ర ఎమ్మెల్సీ విక్రమ్ కాకడే పావ్నా నివాసంలో ప్రత్యేకంగా బర్త్‌డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కాకా’ చిత్రం టైటిల్ గ్లింప్స్ విడుదలైంది. హాస్యం, మిస్టరీ, మాస్ యాక్షన్ అంశాలతో రూపొందించిన ఈ గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచింది.
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిరంజీవిని తమ అందరికీ కొండంత అండగా, స్ఫూర్తిప్రదాతగా అభివర్ణించిన బన్నీ.. తన పోస్టులో #KKAVCF హ్యాష్‌ట్యాగ్‌ను జోడించడం అభిమానులను ఆకట్టుకుంది.
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన తమ్ముడు, నటుడు, నిర్మాత, ఏపీ శాసనమండలి సభ్యుడు కొణిదెల నాగబాబు ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ కోకాపేటలో అభిమానులు, సినీ ప్రముఖులను ఆకట్టుకునేలా వినూత్నంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భావోద్వేగ శుభాకాంక్షలు తెలిపారు. చిన్నప్పటి నుంచి తనకు అన్నయ్య చిరంజీవి హీరోగానే కనిపించేవారని, ఆయన కష్టం, క్రమశిక్షణ, కుటుంబంపై చూపిన ప్రేమ తన జీవితానికి స్ఫూర్తిగా నిలిచాయని సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ చిరంజీవిపై భావోద్వేగ పోస్టు చేశారు.
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమా ‘కాకా’ టైటిల్ గ్లింప్స్ విడుదలైంది. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవిని సరికొత్త మాస్ అవతార్‌లో చూపించనున్నట్లు గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది.
Rupee | అంతర్జాతీయ అనిశ్చితి, పెరుగుతున్న ఇంధన ధరలు రూపాయిపై నిరంతరం ఒత్తిడిని పెంచుతున్నాయి. అమెరికా–ఇరాన్ ఘర్షణ మొదలైనప్పటి నుంచి డాలర్‌తో రూపాయి విలువ సుమారు నాలుగు శాతం పతనమైంది. ముడిచమురు ధరలు మరింత పెరిగితే రూపాయి 97కు, ఆ తర్వాత 99 స్థాయికి పడిపోయే అవకాశాలున్నాయని బీఎంఐ అంచనా వేసింది.
బీజేపీ అధిష్ఠానం నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. జాతీయ ఉపాధ్యక్షులుగా 13 మందిని నియమించగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన డి. పురందేశ్వరికి మరోసారి కీలక బాధ్యతలు దక్కాయి. మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. అయితే తెలంగాణకు జాతీయ కార్యవర్గంలో ప్రాతినిధ్యం దక్కకపోవడం, జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్న డీకే అరుణను తప్పించడం చర్చనీయాంశంగా మారింది.
బండ్ల గణేష్ కుమార్తె జనని, సూర్యతేజ వివాహం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబుతో పాటు టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.
21 ఏళ్లకే యువతకు చట్టసభల్లో ప్రవేశం కల్పించే అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర కేబినెట్‌తోపాటు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే టికెట్లలో జెన్ జీలకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజల్లో దేశభక్తి, జాతీయ పతాకంపై గౌరవాన్ని పెంచే ఉద్దేశంతో ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 2026లో ఈ కార్యక్రమం ఆగస్టు 9 నుంచి 17 వరకు కొనసాగుతుంది. త్రివర్ణ పతాకంతో దిగిన ఫొటోను అధికారిక పోర్టల్‌లో అప్‌లోడ్ చేసి డిజిటల్ సర్టిఫికెట్ కూడా పొందొచ్చు.
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల వేళ యూఏఈ నుంచి ఇరాన్‌కు భారీగా ఆస్తులు తరలించినట్లు సమాచారం. సుమారు 2 టన్నుల బంగారం, 3 బిలియన్ డాలర్ల నగదు బదిలీ అయినట్లు ఇరాన్ వర్గాలను ఉటంకిస్తూ కథనాలు వెలువడ్డాయి. ఇరాన్ ప్రతీకార దాడుల ముప్పును తప్పించుకునేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.