మహనీయులకు మెగాస్టార్ ఘన నివాళి.. ఏమన్నారంటే?

జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి వారికి ఘన నివాళులర్పించారు. సత్యం, అహింసతో గాంధీజీ అందించిన పోరాట స్ఫూర్తిని, ‘జై జవాన్–జై కిసాన్’ నినాదంతో శాస్త్రి చూపిన దేశభక్తిని గుర్తుచేసుకుంటూ ఎక్స్ వేదికగా భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు.

2 అక్టోబర్, 2026 3:22 PM•ByNarender Kumar Nangunoori

Share this article

మహనీయులకు మెగాస్టార్ ఘన నివాళి.. ఏమన్నారంటే?

సినిమా డెస్క్, అక్టోబర్ 2 (జనవాణి): జాతిపిత మహాత్మా గాంధీ, భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి వారికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ఇద్దరు మహనీయుల దేశ సేవలను గుర్తుచేసుకుంటూ ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు.

భారతదేశానికి మహోన్నత సేవలు అందించిన ఇద్దరు మహనీయులు సత్యాన్ని ఆయుధంగా, అహింసను మార్గంగా ఎంచుకుని ప్రపంచానికి సరికొత్త పోరాట స్ఫూర్తిని అందించిన జాతిపిత మహాత్మా గాంధీజీ. జీవితాంతం నిరాడంబరతకు, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచి ‘జై జవాన్–జై కిసాన్’ నినాదంతో దేశాన్ని ఏకతాటిపై నడిపించిన శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు. వారి ఆశయాలు మనందరికీ సదా స్ఫూర్తిదాయకం. ఈ ఇద్దరు మహనీయుల జయంతి సందర్భంగా వారి దివ్యస్మృతికి ఘన నివాళులు అని చిరంజీవి పేర్కొన్నారు.

గాంధీజీ సత్యం, అహింసను ఆయుధాలుగా చేసుకుని స్వాతంత్య్రోద్యమానికి కొత్త దిశను చూపగా.. లాల్ బహదూర్ శాస్త్రి ‘జై జవాన్–జై కిసాన్’ నినాదంతో దేశ రక్షణలో సైనికులు, దేశానికి అన్నం పెట్టే రైతుల ప్రాధాన్యతను చాటిచెప్పారు. చిరంజీవితో పాటు పలువురు టాలీవుడ్, రాజకీయ ప్రముఖులు కూడా సోషల్ మీడియా వేదికగా గాంధీజీ, శాస్త్రి సేవలను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు. వారి ఆశయాలు, దేశం కోసం చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. మహనీయుల అడుగుజాడల్లో నడవడమే వారికి అందించే నిజమైన నివాళి అని పలువురు పేర్కొన్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు