తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వేములవాడలో పర్యటించారు. జనజీవన స్రవంతిలోకి వచ్చిన మాజీ మావోయిస్టులు ప్రజాసేవలోకి రావాలని, తమ పార్టీలో చేరి ప్రజల కోసం పనిచేయాలని ఆమె ఆహ్వానించారు. మరోవైపు వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన కవిత ఆలయ పునర్నిర్మాణంలో కాంక్రీట్ వినియోగాన్ని వ్యతిరేకించారు.
కాంగ్రెస్‌లో ఎలాంటి వర్గపోరు లేదని తెలంగాణ మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. నేతలంతా పార్టీ బలోపేతం, రాష్ట్ర అభివృద్ధి కోసమే పనిచేస్తున్నారని తెలిపారు. మంచిర్యాలలో పర్యటించిన మంత్రి.. 22ఏ భూముల సమస్య, కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, కాళేశ్వరం ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో రికార్డు స్థాయిలో వరి దిగుబడికి కాళేశ్వరం ప్రాజెక్టు కారణం కాదని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. మంచి వర్షాలు, కొత్త బోర్లు, రైతు సంక్షేమ పథకాలే సాగు విస్తీర్ణం పెరగడానికి కారణమని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని చట్టబద్ధమైన అనుమతులు, సాంకేతిక క్లియరెన్స్‌లు ఇచ్చిన తెలంగాణకు చెందిన ఏడు సాగునీటి ప్రాజెక్టులను మళ్లీ సమీక్షించాలనే అంశాన్ని జీఆర్ఎంబీ 18వ సమావేశం ఎజెండాలో చేర్చడాన్ని హరీశ్‌రావు తీవ్రంగా వ్యతిరేకించారు.
తెలంగాణ నీటి హక్కుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోకుండా ఇప్పుడు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముందుగా కాళేశ్వరం ప్రాజెక్టులో ముడుపుల ఆరోపణలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సీఎం రేవంత్ రెడ్డికి మరోసారి బహిరంగ సవాల్ విసిరారు. ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్, ఇంజనీరింగ్ విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలు, కాళేశ్వరం, ఐటీ ఉద్యోగాలు, రైతుల సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని పలు ఆరోపణలు చేశారు.
గోదావరి, కృష్ణా నదుల్లో నీళ్లు ఉన్నా రైతులకు అందించడం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మూడు నెలలు ఇరిగేషన్ శాఖ తనకు అప్పగిస్తే పరిస్థితి మార్చి చూపిస్తానని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.