శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దర్శనం చేసుకుని తిరిగి హైదరాబాద్ వెళ్తున్న కుటుంబం ఘోర ప్రమాదానికి గురైంది. నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలోని శ్రీశైలం-హైదరాబాద్ ఘాట్‌రోడ్డుపై క్లూజర్ వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.
ప్రముఖ సినీ నటుడు రామ్‌చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల గురువారం కర్నూలు జిల్లాలోని మంత్రాలయాన్ని సందర్శించారు. శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు పొందారు. ఉపాసన రాకతో ఆలయ పరిసరాల్లో అభిమానులు, భక్తుల సందడి నెలకొంది.
వైఎస్ షర్మిల కూతురు అంజలి రెడ్డి వివాహానికి ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. కర్నూలు జిల్లాకు చెందిన సోమాల సుబ్బారెడ్డి, పద్మ దంపతుల కుమారుడు డాక్టర్ రఘురాం రెడ్డితో అంజలి రెడ్డి వివాహం జరగనుంది.
కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ కార్యకర్త శేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిప్పగిరి పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో వారికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది.
ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు గ్లోబల్ ఇన్వెస్టర్ల తొలి ఎంపికగా మారిందని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ సమీపంలోని హోసూరులో టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ ఆధ్వర్యంలో రూ.5,750 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 800 మెగావాట్ల హైబ్రిడ్ క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన ఆయన, రాష్ట్రాన్ని స్వచ్ఛ ఇంధన రంగంలో ప్రపంచ స్థాయి హబ్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
రాయలసీమను దేశంలోనే ప్రముఖ రెన్యూవబుల్ ఎనర్జీ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా మరో కీలక అడుగు పడింది. కర్నూలు జిల్లా పత్తికొండలో టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ, సుజ్‌లాన్ సంస్థల ఆధ్వర్యంలో రూ.5,750 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న 800 మెగావాట్ల సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు.