సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని బొల్లారం 20 బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ క్యాంప్‌లో జరిగిన ఆయుధాల చోరీ కేసులో పోలీసులు భారీ కుట్రను ఛేదించారు. బ్యాంకులు, జ్యువెలరీ షాపులు, సంపన్నుల ఇళ్లలో దోపిడీలకు ఈ ఆయుధాలను ఉపయోగించేందుకు పథకం రచించినట్లు దర్యాప్తులో తేలింది. కేసులో ముగ్గురు సర్వీసులో ఉన్న ఆర్మీ జవాన్లతో పాటు ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
జీహెచ్‌ఎంసీ పునర్వ్యవస్థీకరణకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం పోలీసింగ్ వ్యవస్థలో కీలక మార్పులు చేసింది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్‌సిటీ పోలీస్ కమిషనరేట్ల పరిధుల్లో కొత్త జోన్లు, డివిజన్లు ఏర్పాటు చేయడంతో పాటు పలు పోలీస్ స్టేషన్ల పరిధులను మార్చింది. కొన్ని స్టేషన్ల పేర్లను సవరించగా, మరికొన్ని ప్రాంతాలను ఇతర పోలీస్ స్టేషన్లలో విలీనం చేసింది.
బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ హవల్దార్ ఉప్పుతోళ్ల మల్లేశ్ అలియాస్ రాజుకు మరో ఇద్దరు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఆయుధాగారం ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్న వినోద్, శేషులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మల్లేశ్‌తో వినోద్‌కు ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తులో తేలినట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీస్ అధికారి కావాలన్న దివ్యాంగ యువకుడు రాహుల్ చిరకాల కోరికను మల్కాజ్‌గిరి పోలీసులు నెరవేర్చారు. మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి స్వయంగా రాహుల్‌ను కమిషనరేట్‌కు ఆహ్వానించి, తన కార్యాలయంలో కమిషనర్ కుర్చీలో కూర్చోబెట్టి పోలీస్ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న అనుభూతిని కల్పించారు.