
SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు మరో ఛాన్స్.. సెప్టెంబర్ 16 గడువు పొడిగింపు
తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు పోలీస్ నియామక మండలి కీలక శుభవార్త అందించింది. 7,437 ఎస్సై, కానిస్టేబుల్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును పొడిగించింది. ముందుగా సెప్టెంబర్ 9తో ముగియాల్సిన గడువును సెప్టెంబర్ 16 సాయంత్రం 5 గంటల వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.



