దేశవ్యాప్తంగా రైల్వే మౌలిక వసతుల సామర్థ్యాన్ని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని ఘట్‌కేసర్–కాజీపేట సెక్షన్‌లో 110 కిలోమీటర్ల నాలుగో రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2,419 కోట్లు. అలాగే ఆంధ్రప్రదేశ్ మీదుగా సాగే అరక్కోణం–రేణిగుంట మార్గంలో 3వ, 4వ లైన్ల నిర్మాణానికి కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది.
భారత్ సొంతంగా తయారు చేస్తున్న తొలి బుల్లెట్ ట్రైన్ నిర్మాణం కీలక దశకు చేరుకుంది. రైలు బాడీ ఫ్రేమ్ సిద్ధమైందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వచ్చే ఏడాది మే లేదా జూన్‌లో దేశీయ బుల్లెట్ ట్రైన్‌తో పట్టాలపై పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీలపై మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. కమిటీలను పార్టీ నాయకులకు కేటాయించుకోవడం సరికాదని, తెలంగాణ ఏ ఒక్కరి జాగీరు కాదని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో ఎలా ఉందో.. రేవంత్ రెడ్డి పాలన కూడా అలాగే ఉందని ఆరోపించారు.
కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు శుభవార్త. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న కొమురవెల్లి రైల్వే స్టేషన్ అందుబాటులోకి వచ్చింది. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఈ స్టేషన్‌ను ప్రారంభించి, భక్తులకు రైల్వే సౌకర్యాలు మరింత విస్తరించనున్నట్లు తెలిపారు.