శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దర్శనం చేసుకుని తిరిగి హైదరాబాద్ వెళ్తున్న కుటుంబం ఘోర ప్రమాదానికి గురైంది. నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలోని శ్రీశైలం-హైదరాబాద్ ఘాట్‌రోడ్డుపై క్లూజర్ వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.
శ్రీశైలంలోని వడ్డెర అన్నదాన సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. మూడు రోజులుగా గది నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో పాటు దుర్వాసన రావడంతో నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు తెరిచి చూడగా ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు మృతిచెందినట్లు గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులే కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
జూరాల ప్రాజెక్టుకు 2.20 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండటంతో 26 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలానికి 2.07 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది.
వన్యప్రాణుల సంరక్షణ, అటవీ పరిరక్షణలో విశిష్ట సేవలు అందించిన ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖకు జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం దక్కింది. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA) ప్రకటించిన ప్రతిష్ఠాత్మక అవార్డులను ఫారెస్ట్ బీట్ అధికారులు ఎస్. ఇస్మాయిల్, జి. సుధాకరరావు అందుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇద్దరు అధికారులతో పాటు మొత్తం అటవీ శాఖను అభినందించారు.
తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదలతో తెలంగాణ జలాశయాలకు నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జూరాల, కడెం ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తుండగా.. మేడిగడ్డ బ్యారేజీకి భారీ వరద కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి కూడా జూరాల నుంచి వరద ఉధృతంగా చేరుతోంది.