తెలంగాణ శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. 22ఎపై చర్చకు అనుమతించాలంటూ వాయిదా తీర్మానం ప్రతిపాదించగా.. మండలి చైర్మన్ తిరస్కరించారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పోడియం వద్దకు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అనంతరం మండలి నుంచి వాకౌట్ చేశారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల మూడో రోజు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సభలో నిరసనకు దిగిన 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను స్పీకర్ ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు. కేటీఆర్, హరీష్‌రావు, జగదీష్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి తదితరులు సస్పెన్షన్‌కు గురయ్యారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. తాతా మధుపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క డిమాండ్ చేశారు. ఆయనను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు శాసనమండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు, పార్టీలోని అంతర్గత పరిణామాలపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ గీత దాటిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం, కేబినెట్ పనితీరులో మార్పులు అవసరమని సూచించారు. రాష్ట్రంలో పెన్షన్‌ను రూ.4,000కు పెంచడంతో పాటు రైతు భరోసాను కొనసాగించాలని కోరారు.