విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా విడుదల వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన ప్రకారం అక్టోబర్ 9న థియేటర్లలోకి రావాల్సిన ఈ చిత్రాన్ని తుది దశ పనులు పూర్తి కాకపోవడంతో వాయిదా వేసినట్లు నిర్మాత నాగవంశీ వెల్లడించారు. నాణ్యత విషయంలో రాజీ పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకున్న ఆధ్యాత్మిక చిత్రం ‘హనుమాన్ అంశ్’ ఇప్పుడు తెలుగులోకి రాబోతోంది. గతంలో తెలుగు విడుదలకు సంబంధించి త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు వినిపించిన ఈ సినిమా, కొన్ని కారణాలతో వాయిదా పడింది. తాజాగా అక్టోబర్ 9న థియేటర్లలోకి వస్తున్నట్లు మేకర్స్ ప్రకటించడంతో అదే రోజున విడుదల కానున్న త్రివిక్రమ్ చిత్రం ‘ఆదర్శకుటుంబం హౌస్ నెంబర్ 47’ తో ఆసక్తికరమైన పోటీ నెలకొంది.
విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. ఈ మూవీ నుంచి తొలి పాట ‘నారాయణమ్మ’ను సెప్టెంబర్ 22న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఫోక్ టచ్‌తో సాగే ఈ మాస్ సాంగ్‌లో వెంకటేష్‌తో కలిసి శ్రీనిధి శెట్టి, డింపుల్ హయతి, నివేదా పేతురాజ్ సందడి చేయనున్నారు.
విక్టరీ వెంకటేశ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47’ సినిమాపై ఆసక్తికర వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా విడుదలైన టీజర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సినిమాపై అంచనాలను పెంచగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ అందించనున్నాడనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు సినిమా విడుదల తేదీపై కూడా కొత్త ప్రచారం జరుగుతోంది.
ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవిత ఆధారంగా తెరకెక్కిన హిందీ భక్తిరస చిత్రం ‘హనుమాన్ అంశ్’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా హిందీలో రూ.175 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సమర్పణలో సెప్టెంబర్ 18న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.
టాలీవుడ్‌లో విడుదలైన ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాల వెనుక ఆసక్తికరమైన కథలు దాగి ఉంటాయి. కొంతమంది హీరోలు తిరస్కరించిన కథలే తర్వాత ఇండస్ట్రీ హిట్లుగా నిలిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాంటి జాబితాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన 'అ..ఆ' సినిమా కూడా చేరింది. ఈ కథను ముందుగా నాగచైతన్యకు వినిపించారని, అయితే కొన్ని కారణాల వల్ల ఆయన తిరస్కరించారని సోషల్ మీడియాలో మరోసారి చర్చ సాగుతోంది.