సినిమా డెస్క్: కేజీఎఫ్ సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన యష్ నటిస్తున్న తాజా చిత్రం టాక్సిక్. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. విడుదలైన టీజర్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. తాజాగా మేకర్స్ విడుదల చేసిన రెండో పాట *మానసాగదే* ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే ఈ పాటలో అందరి దృష్టిని ఆకర్షించింది నయనతార. సాధారణంగా తన పాత్రల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉండే ఆమె, ఈ సినిమాలో సిగరెట్ తాగుతూ కనిపించడం నెటిజన్లలో చర్చకు దారితీసింది. కథ డిమాండ్ మేరకే ఈ సన్నివేశంలో నటించారా? లేక పాత్ర కోసం తన ఇమేజ్‌కు భిన్నంగా వెళ్లారా? అంటూ సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సినిమా కథ కూడా ఆసక్తికరంగానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సాధారణ గ్యాంగ్‌స్టర్ సినిమాల తరహాలో కాకుండా, గోవా పోర్చుగీస్ పాలనలో ఉన్న కాలం నేపథ్యంలో ఈ కథ సాగుతుందని సమాచారం. 1940 నుంచి 1970 మధ్యకాలంలో స్మగ్లింగ్ ముఠాల ఎదుగుదల, రాజకీయ పరిణామాలు, ఒక సామ్రాజ్యం ఆవిర్భావం, పతనం వంటి అంశాలను ఫిక్షనల్ డ్రామాగా చూపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ చిత్రంలో యష్ రయా అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, పోస్టర్లు, పాటలు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.
టాక్సిక్‌లో నయనతారతో పాటు కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను దిల్ రాజు సొంతం చేసుకున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ హక్కుల విలువ రూ.120 కోట్ల వరకు ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ మొత్తం గురించి అధికారికంగా ఎలాంటి ధృవీకరణ లేదు. విడుదలకు ముందే సినిమా బిజినెస్‌పై ఇంత చర్చ జరగడం టాక్సిక్‌పై ఉన్న అంచనాలకు నిదర్శనంగా సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రం ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.




















