ఒకప్పుడు తరుణ్ హీరోగా నటించిన ‘సఖియా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి నౌహీద్ సైరసి తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. ముంబై నుంచి గోవాకు ఆమె వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించారు. ఈ సందర్భంగా తన రైలు ప్రయాణ అనుభవాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో రూపంలో పంచుకున్నారు. 'నా 8 గంటల ప్రయాణంలో నేను తిన్నదంతా ఇదే' అంటూ నౌహీద్ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో తనకు ప్రయాణంలో అందించిన వివిధ రకాల ఆహార పదార్థాలను ఆమె చూపించారు.
ఉదయం టీతో మొదలైన జర్నీ
నౌహీద్ తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 6 గంటలకు వేడి టీ, బిస్కెట్లతో ఆమె ప్రయాణం ప్రారంభమైంది. అనంతరం ఉదయం 8 గంటలకు బ్రేక్‌ఫాస్ట్‌గా వైట్ బ్రెడ్, ఉప్మా, వెజ్ కట్లెట్, ఫ్రెంచ్ ఫ్రైస్ అందించారు. ఆ తర్వాత మధ్యాహ్న భోజనంలో పప్పు, అన్నం, రోటీ, పనీర్ కూర, పెరుగు వడ్డించారు. ప్రధాన భోజనం రుచిగా ఉందని నౌహీద్ పేర్కొన్నారు. అయితే డెజర్ట్‌గా ఇచ్చిన షీరా మాత్రం తనకు పెద్దగా నచ్చలేదని తెలిపారు. వీటితో పాటు ప్రయాణంలో చాక్లెట్లు, కప్‌కేక్‌లు వంటి ఇతర స్నాక్స్ కూడా అందించినట్లు ఆమె వీడియోలో వెల్లడించారు.
ముంబై-గోవా వందే భారత్‌కు భారీ డిమాండ్
నౌహీద్ పోస్ట్‌తో ముంబై సీఎస్‌ఎంటీ-మడ్గావ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (22229/22230) మరోసారి చర్చలోకి వచ్చింది. 2023 జూన్‌లో ప్రారంభమైన ఈ రైలు వారానికి ఆరు రోజులు నడుస్తోంది. దాదర్, థానే, పన్వేల్, రత్నగిరి వంటి కీలక స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. ముఖ్యంగా కొంకణ్ మార్గంలో పశ్చిమ కనుమల మధ్య సాగే ప్రయాణం ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునే ప్రయాణికులకు ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది.
ప్రస్తుతం ఈ రైలును 8 కోచ్‌లతో నడుపుతుండగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 16 కోచ్‌లకు విస్తరించే యోచనలో రైల్వే శాఖ ఉన్నట్లు సమాచారం. మొత్తంగా చూస్తే నౌహీద్ షేర్ చేసిన వీడియో వందే భారత్‌లో ప్రయాణ సౌకర్యాలతో పాటు రైలులో అందించే ఫుడ్‌పై కూడా నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.




















