సినిమాలు మానేయాలనుకున్నా..విడాకుల తర్వాత కెరీర్‌పై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు

వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదుడుకులు, అనారోగ్య సమస్యల కారణంగా సినిమాలకు గుడ్‌బై చెప్పాలని అనుకున్నానని నటి సమంత వెల్లడించింది. అయితే ఆ సమయంలో తన జీవితంలోకి వచ్చిన రాజ్ నిడిమోరు ఇచ్చిన ధైర్యం, నమ్మకంతోనే ‘మా ఇంటి బంగారం’ సినిమాతో మళ్లీ నటించానని చెప్పింది. భర్త ఇచ్చిన మోరల్ సపోర్ట్ తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని సమంత తెలిపింది.

10 సెప్టెంబర్, 2026 6:20 PM•ByNarender Kumar Nangunoori

Share this article

సినిమాలు మానేయాలనుకున్నా..విడాకుల తర్వాత కెరీర్‌పై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు

Social Media Image

సినిమా కెరీర్‌లో ఎన్నో విజయాలను అందుకున్న స్టార్ హీరోయిన్ సమంత.. కొంతకాలం వ్యక్తిగత, ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ‘మా ఇంటి బంగారం’ విజయంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి తన సత్తా చాటింది. ఈ నేపథ్యంలో తన కెరీర్‌లో ఎదురైన కష్టాలపై సమంత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదుడుకులతో పాటు మయోసైటిస్‌తో బాధపడిన సమయంలో తాను సినిమాలను కొనసాగించడంపై ఎన్నో సందేహాలు కలిగాయని సమంత తెలిపింది. ఆ సమయంలో ‘సిటాడెల్’ వెబ్‌సిరీస్‌తో పాటు మరో తెలుగు సినిమాకు అంగీకరించినట్లు చెప్పింది.

‘నా వల్లే టైమ్ వేస్ట్ అవుతోందనే భావన కలిగింది’

అనారోగ్య కారణంగా షూటింగ్‌లకు అంతరాయం ఏర్పడిన సందర్భాలు చాలానే ఉన్నాయని సమంత చెప్పింది. సెట్స్‌లో అందరూ మేకప్ వేసుకుని తన కోసం ఎదురుచూస్తుండటం తనను ఎంతో బాధించేదని తెలిపింది. తన వల్ల ఇతరులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో సినిమాలు మానేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది. ఆ సమయంలో తన వద్దకు వచ్చిన ఎన్నో కథలను తిరస్కరించానని, నటిగా కాకుండా నిర్మాతగా సినిమాలు చేస్తూ తెరవెనుక ఉండిపోవాలని అనుకున్నానని సమంత పేర్కొంది.

రాజ్ నిడిమోరు వల్లే ‘మా ఇంటి బంగారం’

ఇలాంటి పరిస్థితుల్లోనే రాజ్ నిడిమోరు తన జీవితంలోకి వచ్చారని సమంత తెలిపింది. తాను చేయగలనో లేదో అన్న అపనమ్మకంతోనే ‘మా ఇంటి బంగారం’ సినిమాను అంగీకరించినట్లు చెప్పింది. అయితే రాజ్ మాత్రం తనపై పూర్తిగా నమ్మకం ఉంచారని, తనలో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపారని ప్రశంసించింది. కష్టకాలంలో రాజ్ అందించిన మోరల్ సపోర్ట్ తనను మరింత బలంగా మార్చిందని సమంత చెప్పింది. ఆయన ఇచ్చిన నమ్మకంతోనే మళ్లీ సినిమాల్లోకి అడుగుపెట్టగలిగానని పేర్కొంది.

ఇక ‘మా ఇంటి బంగారం’ విజయంతో సమంతకు మంచి కమ్‌బ్యాక్ లభించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సక్సెస్‌తో పాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన గుడ్‌న్యూస్‌ను కూడా సమంత అభిమానులతో పంచుకున్నట్లు సమాచారం. దీంతో ఆమె చేసిన తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు