యూట్యూబ్ షార్ట్ ఫిలింస్‌ చేసి.. ఇప్పుడు టాలీవుడ్‌లో దూసుకెళ్తున్న 7 గురు హీరోయిన్‌లు..!

సినిమా ఇండస్ట్రీలో ఒక్క ఛాన్స్ జీవితాన్నే మార్చేస్తుంది. పెద్ద హీరోయిన్లుగా ఎదిగిన చాలామంది ఒకప్పుడు యూట్యూబ్, షార్ట్ ఫిలింస్‌లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత వెండితెరపై అవకాశాలు అందుకుని తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. చాందినీ చౌదరీ, వైష్ణవి చైతన్య, ప్రియాంక జవాల్కర్, రీతూ వర్మ వంటి బ్యూటీస్ షార్ట్ ఫిలింస్‌తో మొదలుపెట్టి టాలీవుడ్‌లో హీరోయిన్లుగా ఎదిగారు. మరి ఒకప్పుడు యూట్యూబ్‌లో కనిపించిన ఈ నటీమణులు ఇప్పుడు ఎలా ఉన్నారు? వారి సినిమా ప్రయాణం ఎలా సాగిందో చూస్తే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే!

13 ఆగస్టు, 2026 2:30 PM•ByLaharika

Share this article

యూట్యూబ్ షార్ట్ ఫిలింస్‌ చేసి.. ఇప్పుడు టాలీవుడ్‌లో దూసుకెళ్తున్న 7 గురు హీరోయిన్‌లు..!

ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం. ఇక్కడ ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పడం కష్టం. సినిమా అవకాశాల కోసం చాలామంది ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఆడిషన్స్ ఇస్తుంటే.. మరికొందరు షార్ట్ ఫిలింస్, యూట్యూబ్ వీడియోల ద్వారా తమ టాలెంట్‌ను ప్రేక్షకులకు పరిచయం చేస్తుంటారు. అలా షార్ట్ ఫిలింస్‌తో మొదలుపెట్టి వెండితెరపై హీరోయిన్‌లుగా గుర్తింపు తెచ్చుకున్న వారు టాలీవుడ్‌లో చాలామందే ఉన్నారు.

వారిలో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు చాందినీ చౌదరీ. ‘ది బ్లైండ్ డేట్’, ‘మధురం’, ‘టూ సైడ్ లవ్’ వంటి షార్ట్ ఫిలింస్‌తో పాపులర్ అయిన ఆమె.. ఆ తర్వాత ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’, ‘బ్రహ్మోత్సవం’, ‘లై’ వంటి సినిమాల్లో చిన్న పాత్రలు చేసింది. ‘కలర్ ఫోటో’తో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుని ‘సమ్మతమే’, ‘గామి’ వంటి చిత్రాల్లోనూ మెప్పించింది.

వైష్ణవి చైతన్య కూడా షార్ట్ ఫిలింస్ ద్వారానే తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ‘క్షణం ఒక యుగం’, ‘మిస్సమ్మ’, ‘ప్రియతమా’, ‘సాఫ్ట్‌వేర్ డెవలపర్’ వంటి షార్ట్ ఫిలింస్‌లో నటించిన ఆమె.. సినిమాల్లోకి రాకముందే యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ‘టచ్ చేసి చూడు’, ‘అలా వైకుంఠపురములో’, ‘రంగ్‌దే’, ‘టక్ జగదీష్’, ‘వరుడు కావలెను’ వంటి సినిమాల్లో కీలక పాత్రలు చేసిన వైష్ణవి.. ‘బేబీ’తో హీరోయిన్‌గా సెన్సేషనల్ డెబ్యూ ఇచ్చింది. ఆ తర్వాత ‘లవ్ మీ’, ‘జాక్’ వంటి సినిమాల్లో నటించింది.

ప్రియాంక జవాల్కర్ కూడా షార్ట్ ఫిలింస్‌తోనే కెరీర్ ప్రారంభించింది. ‘పొసెసివ్‌నెస్’, ‘ఎ గర్ల్ థింగ్’ వంటి షార్ట్ ఫిలింస్ చేసిన ఆమె.. కొంతకాలం క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాల్లో కనిపించి, ‘టాక్సీవాలా’తో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘తిమ్మరుసు’, ‘SR కళ్యాణ మండపం’, ‘గమనం’, ‘మ్యాడ్ స్క్వేర్’ వంటి సినిమాల్లో నటించింది.

ఇక రీతూ వర్మ విషయానికి వస్తే.. ‘అనుకోకుండా’ అనే షార్ట్ ఫిలింతో తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత ‘బాద్‌షా’లో హీరోయిన్ చెల్లెలి పాత్రలో కనిపించి, ‘ప్రేమ ఇష్క్ కాదల్’తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘పెళ్లి చూపులు’ సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘కేశవ’, ‘టక్ జగదీష్’, ‘ఒకే ఒక జీవితం’, ‘స్వాగ్’ వంటి చిత్రాల్లో నటించింది. తమిళంలోనూ ‘కనులు కనులు దోచాయంటే’, ‘మార్క్ ఆంటోని’ వంటి సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకుంది.

మరోవైపు అనన్య నాగళ్ల ‘మల్లేశం’తో హీరోయిన్‌గా పరిచయమై, ‘ప్లేబ్యాక్’, ‘వకీల్ సాబ్’, ‘మ్యాస్ట్రో’ వంటి చిత్రాల్లో నటించింది. శివాని నాగారం కూడా ‘అలా మొదలైంది’, ‘అలా IT ఆఫీస్‌లో’, ‘లేడీ బాస్’ వంటి షార్ట్ ఫిలింస్‌తో గుర్తింపు తెచ్చుకుని ‘అంబాజిపేట మ్యారేజ్ బ్యాండ్’తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘లిటిల్ హార్ట్స్’, ‘హే బలవంత్’ వంటి సినిమాల్లో నటించింది.

తేజస్వీ రావు కూడా షార్ట్ ఫిలింస్ నుంచి వచ్చి హీరోయిన్‌గా సక్సెస్ అందుకున్న మరో బ్యూటీ. ‘అద్భుతం’, ‘పెళ్లి చూపులు’, ‘పెళ్లి కూతురు’, ‘సీతా కళ్యాణం’ వంటి షార్ట్ ఫిలింస్‌తో గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది.

వీరితో పాటు సిరి హన్మంతు, దివ్య శ్రీపాద, చాందనీ రావు వంటి పలువురు నటీమణులు కూడా షార్ట్ ఫిలింస్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చి సినిమాల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంటే.. ఒకప్పుడు యూట్యూబ్‌లో చిన్న చిన్న కథల్లో కనిపించిన ఈ అమ్మాయిలే ఇప్పుడు వెండితెరపై అవకాశాలు అందుకుంటూ తమ కెరీర్‌ను మరింత ముందుకు తీసుకెళ్తున్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు