స్పైడ‌ర్ మ్యాన్‌కు పెళ్లి చేసిన ఫ్యాన్స్...వైరల్ అవుతున్న క్రియేటివ్ వీడియో

ఇటీవ‌ల థియేట‌ర్ల‌కు వ‌చ్చిన 'స్పైడర్ మ్యాన్' సినిమా విజయవంతంగా దూసుకెళ్తుండగా, భారతీయ అభిమానులు తమ క్రియేటివిటీతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. తాజాగా టామ్ హాలెండ్-జెండయాకు తమిళ సంప్రదాయంలో పెళ్లి చేసిన AI వీడియో నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తోంది.

5 ఆగస్టు, 2026 4:01 PM•ByNarender Kumar Nangunoori

Share this article

 స్పైడ‌ర్ మ్యాన్‌కు పెళ్లి చేసిన ఫ్యాన్స్...వైరల్ అవుతున్న క్రియేటివ్ వీడియో

ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందనతో దూసుకెళ్తున్న 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే' చిత్రం భారతదేశంలో కూడా బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకుంటోంది. సినిమా విజయాన్ని అభిమానులు తమదైన శైలిలో సెలబ్రేట్ చేస్తూ సోషల్ మీడియాలో వినూత్నమైన AI వీడియోలు, పోస్టర్లతో సందడి చేస్తున్నారు. ఇప్పటికే టామ్ హాలెండ్, జెండయా, సాడీ సింక్‌ల ఫొటోలను AI సాయంతో తెలుగు సినిమాల పోస్టర్లు, పాటలు, సన్నివేశాల్లో రీక్రియేట్ చేసిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి.

ఇప్పుడు తమిళ అభిమానులు మరో అడుగు ముందుకేసి AI తో రూపొందించిన వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ వీడియోలో రియ‌ల్ లైఫ్‌లోనూ ప్రేమికులైన టామ్ హాలెండ్, జెండయాలకు తమిళ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి జరిగినట్లు చూపించారు. అంతేకాదు, ఆ పెళ్లికి మార్వెల్ సూపర్ హీరోలు, అవెంజర్స్ పాత్రలు అతిథులుగా హాజరై పెళ్లి పనులు చేయడం, వంటల్లో పాల్గొనడం వంటి సన్నివేశాలను AIతో సరదాగా రూపొందించారు. ఈ క్రియేటివ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారి నెటిజన్లను నవ్వులు పూయిస్తోంది.

ఈ వీడియోపై అభిమానులు ఫన్నీ కామెంట్లు చేస్తూ, భారతీయ ఫ్యాన్స్ క్రియేటివిటీకి ప్రశంసలు కురిపిస్తున్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు