వరద ప్రభావిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలి.. కామారెడ్డి ఎస్పీ రాజేశ్ చంద్ర సూచన

కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల ప్రాణ రక్షణే పోలీసు శాఖకు ప్రథమ ప్రాధాన్యమని జిల్లా ఎస్పీ ఎం. రాజేశ్ చంద్ర తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాలు, వాగులు, చెరువులు, కల్వర్టుల వద్దకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

4 ఆగస్టు, 2026 3:20 PM•ByRalin

Share this article

వరద ప్రభావిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలి.. కామారెడ్డి ఎస్పీ రాజేశ్ చంద్ర సూచన

పెద్దచెరువు వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలిస్తున్న కామారెడ్డి ఎస్పీ రాజేశ్ చంద్ర

కామారెడ్డి, ఆగస్టు 4 : కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల ప్రాణ రక్షణే పోలీసు శాఖకు ప్రథమ ప్రాధాన్యమని జిల్లా ఎస్పీ ఎం. రాజేశ్ చంద్ర తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాలు, వాగులు, చెరువులు, కల్వర్టుల వద్దకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మంగళవారం కామారెడ్డి పట్టణంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించిన ఆయన పరిస్థితిని సమీక్షించారు. ముందుగా కామారెడ్డి పెద్ద చెరువు వద్దకు వెళ్లిన ఎస్పీ నీటి ప్రవాహం, నీటిమట్టాన్ని పరిశీలించి అధికారులతో పరిస్థితిపై చర్చించారు. జిల్లాలో భారీ వర్షాలు కొనసాగుతున్నందున ప్రజలు, పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సెల్ఫీలు, వీడియోల కోసం వరద ప్రాంతాలకు వెళ్లి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకోవద్దని హెచ్చరించారు. తల్లిదండ్రులు చిన్నారులపై ప్రత్యేక నిఘా ఉంచాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరారు.

ప్రజల భద్రతకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చెరువులు, వాగులు, వరద ప్రభావిత ప్రాంతాలు, రద్దీ కూడళ్ల వద్ద అవసరమైన చోట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

45 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన పోలీసులు

సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా కామారెడ్డి పట్టణంలోని సుభాష్‌ రోడ్‌ చౌరస్తా వద్ద వరద నీటిలో చిక్కుకున్న పెళ్లి బస్సులోని 45 మంది ప్రయాణికులను పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది సమన్వయంతో సురక్షితంగా బయటకు తరలించారు. అనంతరం వారికి ప్రత్యామ్నాయ బస్సు ఏర్పాటు చేసి ప్రయాణం కొనసాగించేలా చర్యలు తీసుకున్నారు.

వర్షాన్ని సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించి ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన పోలీసు, అగ్నిమాపక శాఖ సిబ్బందిని ఎస్పీ రాజేశ్ చంద్ర ప్రత్యేకంగా అభినందించారు. భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు వెంటనే సమీప పోలీస్‌ స్టేషన్‌ను లేదా డయల్‌100 అత్యవసర సేవలను సంప్రదించాలని సూచించారు.

Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు