మేడిగడ్డకు పోటెత్తిన వరద.. ఉదయం నుంచి 50 వేల క్యూసెక్కులు పెరిగిన ఇన్‌ఫ్లో.. 85 గేట్లు ఎత్తి నీటి విడుదల

మేడిగడ్డ బ్యారేజీకి వరద ప్రవాహం క్రమేపీ పెరుగుతోంది. గురువారం మధ్యాహ్నం 12 గంటల నాటికి బ్యారేజీకి 1,31,420 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ఉదయం నమోదైన ప్రవాహంతో పోలిస్తే దాదాపు 50 వేల క్యూసెక్కుల మేర వరద పెరగడం గమనార్హం.

30 జులై, 2026 1:05 PM•ByRamchandram

Share this article

మేడిగడ్డకు పోటెత్తిన వరద.. ఉదయం నుంచి 50 వేల క్యూసెక్కులు పెరిగిన ఇన్‌ఫ్లో.. 85 గేట్లు ఎత్తి నీటి విడుదల

మేడిగడ్డ బరాజ్ వద్ద వరద ప్రవాహం

మహదేవపూర్ (జయశంకర్ భూపాలపల్లి): ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీకి వరద ప్రవాహం పోటెత్తుతోంది. గురువారం మధ్యాహ్నం 12 గంటల నాటికి బ్యారేజీకి 1,31,420 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ఉదయం బ్యారేజీ వద్ద 81,060 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. అంటే ఉదయం నమోదైన ప్రవాహంతో పోలిస్తే దాదాపు 50 వేల క్యూసెక్కుల మేర వరద పెరగడం గమనార్హం.

పెరుగుతున్న వరదను దృష్టిలో ఉంచుకుని నీటిపారుదల శాఖ అధికారులు బ్యారేజీలోని మొత్తం 85 గేట్లను ఎత్తి వచ్చిన నీటినంతా దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో రెండూ 1,31,420 క్యూసెక్కులుగా నమోదయ్యాయి. బ్యారేజీ నీటిమట్టం 90.70 మీటర్లుగా ఉంది.

ప్రస్తుతం గోదావరి నది మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఫ్రీ ఫ్లో పరిస్థితిలో ప్రవహిస్తోందని అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో గోదావరి దిగువన ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నది పరివాహక ప్రాంతాల్లోకి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.

▶CategoriesDistrict, News and Telangana
▶Follow us onFacebook, Twitter & Instagram.
R

Written By

Ramchandram

Newsroom Staff

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు