రామాయంపేట, ఆగస్టు 8(జనవాణి): మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ అభివృద్ధి, సుందరీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన బటర్‌ఫ్లై లైట్లు రామాయంపేటకు ప్రత్యేక శోభను తీసుకొచ్చాయి. ఎన్‌హెచ్-47పై బాలాజీ ఫంక్షన్ హాల్ నుంచి సిద్దిపేట రోడ్డు ఎస్సీ కాలనీ వరకు ఏర్పాటు చేసిన ఈ విద్యుద్దీపాలు రాత్రివేళల్లో ప్రధాన రహదారిని ఆకర్షణీయంగా మారుస్తున్నాయి.
బటర్‌ఫ్లై ఆకారంలో ఏర్పాటు చేసిన లైట్ల వెలుగులతో రాత్రివేళ ప్రధాన రహదారి ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తోంది. పట్టణానికి వచ్చే వారిని సైతం ఇవి ఆకట్టుకుంటున్నాయి. రహదారికి అందాన్ని తీసుకురావడంతో పాటు రాత్రివేళల్లో వెలుతురు పెరగడంతో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు.
ఎమ్మెల్యేకు ప్రజల కృతజ్ఞతలు
రామాయంపేట పట్టణ అభివృద్ధి, సుందరీకరణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్‌రావుకు పట్టణ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సౌకర్యంతో పాటు పట్టణానికి అందం తీసుకొచ్చేలా అభివృద్ధి పనులు చేపడుతుండటంపై అభినందనలు వ్యక్తం చేశారు.
బటర్‌ఫ్లై లైట్లు పట్టణ సుందరీకరణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని, రామాయంపేట అభివృద్ధిలో భాగంగా ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు.





















