ఇంజినీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్.. సీఎం వ్యాఖ్యలపై మహబూబ్‌నగర్‌లో కదం తొక్కిన విద్యార్థులు.. లాఠీచార్జితో ఉద్రిక్తత

ఇంజినీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేయగా, పలువురు విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకుని టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

1 ఆగస్టు, 2026 2:23 PM•ByRalin

Share this article

ఇంజినీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్.. సీఎం వ్యాఖ్యలపై మహబూబ్‌నగర్‌లో కదం తొక్కిన విద్యార్థులు.. లాఠీచార్జితో ఉద్రిక్తత

మహబూబ్‌నగర్, ఆగస్టు 1: ఇంజినీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విద్యార్థులు కదం తొక్కారు. బీజేపీ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో నిరసనలు తెలిపారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పలువురు విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో బీజేపీ నాయకత్వంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, బీజేపీ విద్యార్థి సంఘాల నాయకులు, కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. అనంతరం పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకుని టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ.. యూనివర్సిటీ విద్యార్థులపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, విద్యార్థులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనతో కొంతసేపు తెలంగాణ చౌరస్తా పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు