గణేష్‌ నిమజ్జనంలో ఖాకీల సందడి..పోలీసుల డ్యాన్స్‌కు ఫిదా అవుతున్న నెటిజన్లు

హైదరాబాద్‌ గణేశ్‌ నిమజ్జన వేడుకల్లో భక్తి, సందడి నడుమ పోలీసుల సరదా డ్యాన్స్‌లు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. గణేష్‌ నిమజ్జనం సందర్భంగా కొందరు పోలీసులు డ్యాన్స్‌ స్టెప్పులతో సందడి చేయగా ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

26 సెప్టెంబర్, 2026 1:23 PM•ByNarender Kumar Nangunoori

Share this article

గణేష్‌ నిమజ్జనంలో ఖాకీల సందడి..పోలీసుల డ్యాన్స్‌కు ఫిదా అవుతున్న నెటిజన్లు

హైదరాబాద్,సెప్టెంబర్ 26 (జనవాణి): హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జన వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఖైరతాబాద్‌ బడా గణేష్‌, బాలాపూర్‌ గణేష్‌ సహా భారీ సంఖ్యలో వినాయక విగ్రహాలు హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం అయ్యాయి. మరోవైపు నిమజ్జనం కోసం వేలాది విగ్రహాలు హుస్సేన్‌సాగర్‌ పరిసరాల్లో బారులు తీరాయి. భారీ గణేశ్‌ విగ్రహాలు, భక్తుల కోలాహలం, డప్పుల మోత మధ్య పోలీసులు మరోవైపు శాంతిభద్రతలు, ట్రాఫిక్‌ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. అదే సమయంలో ఉత్సవ వాతావరణంలో కాసేపు భక్తులతో కలిసి డ్యాన్స్‌ చేసిన దృశ్యాలు కెమెరాల్లో రికార్డయ్యాయి.

ఈ క్రమంలో నిమజ్జన వేడుకల్లో విధులు నిర్వహిస్తున్న కొందరు పోలీసులు చేసిన డ్యాన్స్‌లు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఖైరతాబాద్‌ బడా గణేష్‌ నిమజ్జనం సందర్భంగా పలువురు పోలీసులు స్టెప్పులతో ఉత్సాహంగా డ్యాన్స్‌ చేశారు. చుట్టూ ఉన్న పోలీసులు, భక్తులు చప్పట్లు కొడుతూ వారిని ప్రోత్సహించారు. నిమజ్జన ఊరేగింపులో భక్తి, కోలాహలం మధ్య చోటుచేసుకున్న ఈ సరదా దృశ్యాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోల్లో ఓ పోలీసు అధికారి జనాల మధ్యకు వచ్చి చేతులను తలపైకి ఎత్తి నాగిని తరహా స్టెప్పులతో సందడి చేశారు. దీంతో చుట్టూ ఉన్న పోలీసులు, భక్తులు చప్పట్లతో ఆయనను ఉత్సాహపరిచారు. ఆయన డ్యాన్స్‌కు తోటి పోలీసు సిబ్బంది కూడా జత కలిశారు. కొంతమంది పోలీసులు చిరునవ్వులతో చేతులు పైకెత్తుతూ స్టెప్పులు వేయగా.. భక్తులు, మీడియా ప్రతినిధులు సైతం వారితో కలిసి డ్యాన్స్‌ చేశారు. దీంతో నిమజ్జన ఊరేగింపు ప్రాంతంలో ఉత్సాహం మరింత పెరిగింది.

ఎప్పుడూ విధి నిర్వహణలో సీరియస్‌గా కనిపించే పోలీసులు ఇలా ఉత్సవ వాతావరణంలో స్టెప్పులు వేయడంతో ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. పోలీసుల డ్యాన్స్‌ చూసిన నెటిజన్లు ఆసక్తిగా స్పందిస్తున్నారు. పలువురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు సైతం భక్తులతో కలిసి ఉత్సాహంగా స్టెప్పులు వేయడం ఈ నిమజ్జన వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు