#Hyderabad Ganesh

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Hyderabad Ganesh.

17 Stories

Stories tagged with #Hyderabad Ganesh

హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం ప్రశాంతం..పోలీసులతో కలిసి సంబరాలు చేసుకున్న సీపీ సజ్జనార్
news,telangana

హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం ప్రశాంతం..పోలీసులతో కలిసి సంబరాలు చేసుకున్న సీపీ సజ్జనార్

హైదరాబాద్‌లో రెండు రోజులుగా కొనసాగిన గణేశ్ నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా శోభాయాత్ర విజయవంతంగా పూర్తవడంతో పోలీసులు, అధికారులు సంబరాలు చేసుకున్నారు.

26 సెప్టెం, 20261 min read
గణేష్‌ నిమజ్జనంలో ఖాకీల సందడి..పోలీసుల డ్యాన్స్‌కు ఫిదా అవుతున్న నెటిజన్లు
entertainment,news,spiritual,telangana

గణేష్‌ నిమజ్జనంలో ఖాకీల సందడి..పోలీసుల డ్యాన్స్‌కు ఫిదా అవుతున్న నెటిజన్లు

హైదరాబాద్‌ గణేశ్‌ నిమజ్జన వేడుకల్లో భక్తి, సందడి నడుమ పోలీసుల సరదా డ్యాన్స్‌లు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. గణేష్‌ నిమజ్జనం సందర్భంగా కొందరు పోలీసులు డ్యాన్స్‌ స్టెప్పులతో సందడి చేయగా ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

26 సెప్టెం, 20262 min read
గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహాగణపయ్య.. ఘనంగా నిమజ్జనం
news,spiritual,telangana

గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహాగణపయ్య.. ఘనంగా నిమజ్జనం

హైదరాబాద్‌లో ఖైరతాబాద్ మహాగణపయ్య నిమజ్జనం ఘనంగా పూర్తైంది. ట్యాంక్‌బండ్ క్రేన్ నంబర్-4 వద్ద పంచముఖ సంకటహర మహాగణపతి విగ్రహాన్ని ప్రత్యేక పూజల అనంతరం గంగమ్మ ఒడికి చేర్చారు. భారీగా తరలివచ్చిన భక్తులతో ట్యాంక్‌బండ్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.

25 సెప్టెం, 20261 min read
ఖైరతాబాద్ మహాగణపతి ఎదుట దానం నాగేందర్ డ్యాన్స్‌.. ఆకట్టుకున్న దృశ్యం
news,spiritual,telangana

ఖైరతాబాద్ మహాగణపతి ఎదుట దానం నాగేందర్ డ్యాన్స్‌.. ఆకట్టుకున్న దృశ్యం

హైదరాబాద్‌లో ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ఘనంగా ప్రారంభమైంది. టస్కర్ ముందు దానం నాగేందర్ కొబ్బరికాయ కొట్టి యాత్రను ప్రారంభించారు. భారీగా తరలివచ్చిన భక్తుల మధ్య గణనాథుడు నిమజ్జనానికి తరలివెళ్తున్నాడు.

25 సెప్టెం, 20261 min read
చార్మినార్‌ వద్ద హైఅలర్ట్‌.. ఒకవైపు గణేష్ నిమజ్జనాలు, మరోవైపు శుక్రవారం ముస్లిం ప్రార్థనలు
news,spiritual,telangana

చార్మినార్‌ వద్ద హైఅలర్ట్‌.. ఒకవైపు గణేష్ నిమజ్జనాలు, మరోవైపు శుక్రవారం ముస్లిం ప్రార్థనలు

హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జన శోభాయాత్రలు కొనసాగుతున్న నేపథ్యంలో శుక్రవారం ప్రార్థనలను దృష్టిలో పెట్టుకుని చార్మినార్‌, పాతబస్తీ పరిసరాల్లో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. కీలక ప్రాంతాల్లో బాంబ్‌ డిటెక్షన్‌ బృందాలు, ప్రత్యేక పోలీసు బలగాలతో తనిఖీలు చేపడుతూ సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు.

25 సెప్టెం, 20262 min read
బాలాపూర్ లడ్డూకు మళ్లీ రికార్డు ధర.. ఈసారి రూ.39 లక్షలు!
news,spiritual,telangana

బాలాపూర్ లడ్డూకు మళ్లీ రికార్డు ధర.. ఈసారి రూ.39 లక్షలు!

బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం మరోసారి రికార్డు సృష్టించింది. ఏటా పెరుగుతూ వస్తున్న లడ్డూ ధర ఈసారి ఏకంగా రూ.39 లక్షలకు చేరింది. సాహెబ్‌నగర్‌కు చెందిన అర్బన్ గ్రూప్ అధినేత సామ ప్రణీత్ రెడ్డి ఈ ఏడాది లడ్డూను దక్కించుకున్నారు. గతేడాది రూ.35 లక్షలుగా ఉన్న ధరతో పోలిస్తే ఈసారి మరో రూ.4 లక్షలు పెరిగింది.

25 సెప్టెం, 20263 min read
భక్తులకు గుడ్‌న్యూస్..మెట్రో సేవలు పొడిగింపు.. 24 గంటల పాటు ప్రత్యేక బస్సులు..!
news,telangana

భక్తులకు గుడ్‌న్యూస్..మెట్రో సేవలు పొడిగింపు.. 24 గంటల పాటు ప్రత్యేక బస్సులు..!

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జన మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. భారీగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు, మెట్రో, టీజీఎస్‌ఆర్టీసీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.

25 సెప్టెం, 20261 min read
తాపేశ్వరం నుంచి ఖైరతాబాద్ గణేశుడికి భారీ లడ్డూ.. ఈ సంప్రదాయం వెనుక కథ ఇదే!
news,spiritual,telangana

తాపేశ్వరం నుంచి ఖైరతాబాద్ గణేశుడికి భారీ లడ్డూ.. ఈ సంప్రదాయం వెనుక కథ ఇదే!

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం గణనాథుడిని నిమజ్జనం చేయనున్నారు. అయితే నిమజ్జనం సందర్భంగా మరో ప్రత్యేకత భక్తులను ఆకట్టుకుంటోంది. తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరం నుంచి ఏటా ఖైరతాబాద్ గణేశుడికి సమర్పించే భారీ లడ్డూకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ సంప్రదాయం ఎలా ప్రారంభమైంది? లడ్డూను ఎలా తయారు చేస్తారు? తెలుసుకుందాం.

25 సెప్టెం, 20261 min read
రూ.450 నుంచి రూ.35 లక్షలకు.. బాలాపూర్ లడ్డూ వేలం ప్రస్థానం ఇదే!
news,telangana,spiritual

రూ.450 నుంచి రూ.35 లక్షలకు.. బాలాపూర్ లడ్డూ వేలం ప్రస్థానం ఇదే!

బాలాపూర్ గణేష్ ఉత్సవాల్లో కీలక ఘట్టమైన లడ్డూ వేలానికి రంగం సిద్ధమైంది. చివరి పూజా కార్యక్రమాలు ప్రారంభమైన అనంతరం గణనాథుడిని గ్రామ ప్రదక్షిణకు తీసుకెళ్లనున్నారు. అనంతరం ప్రసిద్ధ బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం జరగనుంది. 1994లో కేవలం రూ.450తో ప్రారంభమైన ఈ వేలం.. 2025 నాటికి రూ.35 లక్షలకు చేరింది. దీంతో ఈసారి లడ్డూ ఎంత ధర పలుకుతుందనే ఆసక్తి నెలకొంది.

25 సెప్టెం, 20262 min read
ఆలస్యంగా ప్రారంభమైన ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర...
news,spiritual,telangana

ఆలస్యంగా ప్రారంభమైన ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర...

హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జన వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఖైరతాబాద్‌ మహాగణపతి శోభాయాత్ర మాత్రం బాహుబలి క్రేన్‌లో సాంకేతిక సమస్య కారణంగా రెండు గంటలకు పైగా ఆలస్యమైంది. సమస్యను పరిష్కరించిన అనంతరం మహాగణపతిని టస్కర్‌పైకి చేర్చి శోభాయాత్రను ప్రారంభించారు. మధ్యాహ్నం 2 గంటల్లోపు నిమజ్జనం పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని సీపీ వీసీ సజ్జనార్‌ తెలిపారు.

25 సెప్టెం, 20262 min read
గణేశ్ నిమజ్జన వేడుకల్లో కొండచిలువతో స్టెప్పులు..విశాఖ డ్యాన్స్ బృందం హంగామా
crime,news,telangana

గణేశ్ నిమజ్జన వేడుకల్లో కొండచిలువతో స్టెప్పులు..విశాఖ డ్యాన్స్ బృందం హంగామా

హైదరాబాద్‌లో జరిగిన గణేశ్ నిమజ్జన వేడుకల్లో కొండచిలువతో ఓ డ్యాన్స్ బృందం చేసిన డ్యాన్స్ తీవ్ర కలకలం రేపింది. విశాఖకు చెందిన డ్యాన్స్ టీమ్‌లో ఓ యువతి మెడలో ఇండియన్ రాక్ పైథాన్‌ను వేసుకుని డ్యాన్స్ చేసింది. ఘటనపై సమాచారం అందుకున్న GHSPCA బృందం సుమారు ఐదు రోజుల పాటు బృందాన్ని ట్రాక్ చేసి, మధురానగర్ పోలీసుల సహకారంతో వారిని గుర్తించింది. అనంతరం కొండచిలువను స్వాధీనం చేసుకుంది.

22 సెప్టెం, 20261 min read
ఖైరతాబాద్‌ మహాగణపతి దర్శనానికి బిగ్ అలర్ట్.. బుధవారం రాత్రి వరకే దర్శనాలు
news,spiritual,telangana

ఖైరతాబాద్‌ మహాగణపతి దర్శనానికి బిగ్ అలర్ట్.. బుధవారం రాత్రి వరకే దర్శనాలు

ఖైరతాబాద్‌ శ్రీ పంచముఖ సంకటహర మహా గణపతి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. అయితే మహాగణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు ప్రారంభమైన నేపథ్యంలో సెప్టెంబర్‌ 23 బుధవారం రాత్రి వరకే భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. సెప్టెంబర్‌ 24న షెడ్డు, బ్యారికేడ్ల తొలగింపు చేపట్టి.. 25న తెల్లవారుజామున మహాగణపతి శోభాయాత్ర నిర్వహించనున్నారు.

22 సెప్టెం, 20262 min read
Ganesh Immersion Banned on Hyderabad Tank Bund
news,spiritual,telangana

ట్యాంక్ బండ్‌పై గణేష్ నిమజ్జనం బ్యాన్..హైకోర్టు ఆదేశాలతో భారీ ఫ్లెక్సీలు

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనోత్సవానికి ఈసారి కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. తెలంగాణ హైకోర్టు ఆదేశాలు, పర్యావరణ పరిరక్షణ నిబంధనల నేపథ్యంలో ట్యాంక్ బండ్‌పై గణేష్ విగ్రహాల నిమజ్జనాన్ని అధికారులు నిషేధించారు. భక్తుల కోసం నగరవ్యాప్తంగా ప్రత్యామ్నాయ నిమజ్జన ప్రాంతాలు, కృత్రిమ చెరువులు, ప్రత్యేక ఘాట్లను సిద్ధం చేస్తున్నారు.

16 సెప్టెం, 20262 min read
24 క్యారెట్ల బంగారంతో పాటు 3.83 లక్షల అమెరికన్ డైమండ్లతో రూపొందించిన గణపతి విగ్రహం
news,spiritual,telangana

హైదరాబాద్ లో బంగారం,అమెరికన్ డైమండ్లతో కొలువుదీరిన గణపయ్య

హైదరాబాద్‌ బేగంబజార్‌లోని లీచీ పర్ల్ సెట్ జ్యువెలరీ షాపులో ఏర్పాటు చేసిన వినాయక మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 24 క్యారెట్ల బంగారంతో పాటు 3.83 లక్షల అమెరికన్ డైమండ్లతో రూపొందించిన గణపతి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ అద్భుత ప్రతిమను దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

15 సెప్టెం, 20261 min read
బాహుబలి తరహాలో గణనాథుడిని భుజానికెత్తుకున్న సీఎం రేవంత్‌రెడ్డి.. వైరల్‌గా వినూత్న గణపతి
news,spiritual,telangana

బాహుబలి తరహాలో గణనాథుడిని భుజానికెత్తుకున్న సీఎం రేవంత్‌రెడ్డి.. వైరల్‌గా వినూత్న గణపతి

హైదరాబాద్‌ గోషామహల్‌ నియోజకవర్గంలోని అగాపురాలో ఏర్పాటు చేసిన వినూత్న గణపతి మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘తెలంగాణ రైజింగ్‌–1000 డేస్‌ యాజ్‌ సీఎం’ థీమ్‌తో రూపొందించిన ఈ మండపంలో సీఎం రేవంత్‌రెడ్డి భుజంపై గణనాథుడిని ఎత్తుకున్నట్లుగా విగ్రహాన్ని తీర్చిదిద్దారు. ఈ ప్రతిమ ‘బాహుబలి’ సినిమాలోని శివలింగాన్ని భుజాన మోసే సన్నివేశాన్ని తలపిస్తోంది.

14 సెప్టెం, 20262 min read
69 అడుగుల ఖైరతాబాద్ మహాగణపతి
news,spiritual,telangana

69 అడుగుల ఖైరతాబాద్ మహాగణపతికి ఘనంగా తొలిపూజ..పాల్గొన్న గవర్నర్ దంపతులు

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మహాగణపతి గణేశ్ ఉత్సవాలకు ఘనంగా శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది 69 అడుగుల ఎత్తులో 'పంచముఖ సంకటహర మహాగణపతి’గా కొలువుదీరిన బడా గణేశుడికి తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ఆయన సతీమణి జానకి శుక్లా తొలి పూజలు నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

14 సెప్టెం, 20262 min read
వినాయక చవితికి హైదరాబాద్‌లో పటిష్ట బందోబస్తు.. సీపీ సజ్జనార్ కీలక ఆదేశాలు
news,spiritual,telangana

వినాయక చవితికి హైదరాబాద్‌లో పటిష్ట బందోబస్తు.. సీపీ సజ్జనార్ కీలక ఆదేశాలు

వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జన వేడుకలను ప్రశాంతంగా, వైభవంగా నిర్వహించేందుకు హైదరాబాద్ పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. గణేశ్ మండపాలకు జియో ట్యాగింగ్‌, ప్రధాన నిమజ్జన మార్గాల్లో ప్రత్యేక ట్రాఫిక్‌ ప్రణాళిక, సోషల్‌ మీడియాలో వదంతులపై 24 గంటల నిఘా వంటి చర్యలకు సీపీ వీసీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు.

5 సెప్టెం, 20262 min read