మొబైల్ నెట్‌వర్క్ రాకపోవడంతో ఆగ్రహం.. టెక్నీషియన్‌ను టవర్‌కు కట్టేసిన గ్రామస్థులు

ఉత్తర్‌ప్రదేశ్‌లో మొబైల్ నెట్‌వర్క్ సమస్యపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్లుగా సమస్య పరిష్కారం కావడం లేదంటూ టవర్ పనుల కోసం వచ్చిన టెలికాం టెక్నీషియన్‌ను చుట్టుముట్టి, ఏకంగా మొబైల్ టవర్‌కు కట్టేశారు.

11 సెప్టెంబర్, 2026 8:48 PM•ByNarender Kumar Nangunoori

Share this article

మొబైల్ నెట్‌వర్క్ రాకపోవడంతో ఆగ్రహం.. టెక్నీషియన్‌ను టవర్‌కు కట్టేసిన గ్రామస్థులు

లక్నో,సెప్టెంబర్ 11 (జనవాణి): మొబైల్ నెట్‌వర్క్ సరిగా పనిచేయడం లేదని ఆగ్రహించిన గ్రామస్థులు ఓ టెలికాం టెక్నీషియన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా అతడిని మొబైల్ టవర్‌కు కట్టేసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఫతేపూర్ జిల్లా హర్దౌలి గ్రామంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. గ్రామంలో గత రెండేళ్లుగా మొబైల్ నెట్‌వర్క్ సమస్య ఉందని స్థానికులు ఆరోపించారు. పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో టవర్‌కు సంబంధించిన పనుల కోసం ఓ టెక్నీషియన్ గ్రామానికి వచ్చాడు. దీంతో అతడిని చుట్టుముట్టిన గ్రామస్థులు.. నెట్‌వర్క్ సమస్యను పరిష్కరించే వరకు విడిచిపెట్టబోమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు టెక్నీషియన్‌ను టవర్‌కు కట్టేశారు.

5G సేవల కోసం రీచార్జ్‌లు చేసుకుంటున్నప్పటికీ నెట్‌వర్క్ సరిగా అందడం లేదని గ్రామస్థులు వాపోయారు. ఫోన్ కాల్స్ చేయడం, ఇంటర్నెట్ వినియోగించడం కూడా తీవ్ర ఇబ్బందిగా మారిందని తెలిపారు.

పోలీసుల రంగప్రవేశం

టెక్నీషియన్‌ను టవర్‌కు కట్టేసిన విషయం పోలీసులకు తెలియడంతో వారు వెంటనే గ్రామానికి చేరుకున్నారు. టెక్నీషియన్‌ను విడిపించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నెట్‌వర్క్ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామస్థులు ఆగ్రహంతో ఈ చర్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు బింద్కి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ శైలేష్ సింగ్ తెలిపారు. టెక్నీషియన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

Loading Tweet...

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు