Independence Day 2026: ‘హర్ ఘర్ తిరంగా' త్రివర్ణ పతాకంతో సెల్ఫీతీసుకొని అప్‌లోడ్ చేసి డిజిటల్ సర్టిఫికెట్ ఇలా పొందండి

భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజల్లో దేశభక్తి, జాతీయ పతాకంపై గౌరవాన్ని పెంచే ఉద్దేశంతో ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 2026లో ఈ కార్యక్రమం ఆగస్టు 9 నుంచి 17 వరకు కొనసాగుతుంది. త్రివర్ణ పతాకంతో దిగిన ఫొటోను అధికారిక పోర్టల్‌లో అప్‌లోడ్ చేసి డిజిటల్ సర్టిఫికెట్ కూడా పొందొచ్చు.

14 ఆగస్టు, 2026 11:43 PM•ByVijay Kumar

Share this article

Independence Day 2026: ‘హర్ ఘర్ తిరంగా' త్రివర్ణ పతాకంతో సెల్ఫీతీసుకొని అప్‌లోడ్ చేసి డిజిటల్ సర్టిఫికెట్ ఇలా పొందండి

Image Credit: harghartiranga.com

న్యూఢిల్లీ August 14 (జనవాణి): ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ‘హర్ ఘర్ తిరంగా 2026’ కార్యక్రమం కొనసాగుతోంది. ఆగస్టు 9 నుంచి 17 వరకు నిర్వహిస్తున్న ఈ ప్రచారంలో ప్రజలు తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడంతో పాటు ‘సెల్ఫీ విత్ తిరంగా’ కార్యక్రమంలోనూ పాల్గొనవచ్చు. త్రివర్ణంతో దిగిన ఫొటోను అధికారిక పోర్టల్‌లో అప్‌లోడ్ చేసి డిజిటల్ సర్టిఫికెట్ కూడా పొందొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

హర్ ఘర్ తిరంగా 2026 అంటే ఏంటి?

భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజల్లో దేశభక్తి, జాతీయ పతాకంపై గౌరవాన్ని పెంచే ఉద్దేశంతో ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 2026లో ఈ కార్యక్రమం ఆగస్టు 9 నుంచి 17 వరకు కొనసాగుతుంది.

భారత్‌లోని ప్రజలతో పాటు విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. ఇందులో భాగంగా ఇంటిపై జాతీయ పతాకాన్ని ప్రదర్శించడం, త్రివర్ణంతో సెల్ఫీ తీసుకుని ప్రచారంలో భాగస్వాములు కావచ్చు.

సెల్ఫీ ఎలా అప్‌లోడ్ చేయాలీ ?

‘సెల్ఫీ విత్ తిరంగా’లో పాల్గొనాలనుకునే వారు ముందుగా అధికారిక హర్ ఘర్ తిరంగా (harghartiranga.com) పోర్టల్‌ను సందర్శించాలి.

స్టెప్ 1: అధికారిక వెబ్‌సైట్‌ ని విజిట్ చేయండి

Image Credit: harghartiranga.com

Image Credit: harghartiranga.com

ముందుగా హర్ ఘర్ తిరంగా అధికారిక పోర్టల్ harghartiranga.com లోకి వెళ్లాలి. ఫొటో అప్‌లోడ్ చేసే ముందు అధికారిక ప్రభుత్వ ప్రచార వెబ్‌సైట్‌నే ఉపయోగిస్తున్నామో లేదో నిర్ధారించుకోవడం మంచిది. పోర్టల్‌లో కనిపించే "upload a selfie" సంబంధిత ఆప్షన్‌ను ఎంచుకుని ముందుకు వెళ్లాలి.

స్టెప్ 2: మీ వివరాలు నమోదు చేయండి

Image Credit: harghartiranga.com

పోర్టల్‌లో అడిగిన వివరాలను నమోదు చేయాలి. పేరు, మొబైల్ నంబర్, రాష్ట్రం, దేశం వంటి వివరాలు అడిగే అవకాశం ఉంటుంది. అయితే ప్రచారం సమయంలో వెబ్‌సైట్ ఇంటర్‌ఫేస్, అడిగే వివరాల్లో మార్పులు ఉండొచ్చు. అందువల్ల స్క్రీన్‌పై కనిపించే తాజా సూచనల ప్రకారమే వివరాలను నమోదు చేయాలి.

స్టెప్ 3: త్రివర్ణంతో సెల్ఫీ సిద్ధం చేసుకోండి

Image Credit: harghartiranga.com


జాతీయ పతాకంతో సెల్ఫీ లేదా ఫొటో తీసుకోవాలి. ఫొటో స్పష్టంగా ఉండేలా చూసుకోవాలి. మీ ఫోన్ లేదా కంప్యూటర్‌లో ఉన్న ఫొటోను పోర్టల్‌లోని అప్‌లోడ్ ఆప్షన్ ద్వారా ఎంచుకోవచ్చు. లేదా కెమెరా ద్వారా నేరుగా ఫొటో తీసుకునే ఆప్షన్లు కూడా ఉన్నది.

స్టెప్ 4: ఫొటో అప్‌లోడ్ చేయండి

Image Credit: harghartiranga.com

ఎంచుకున్న ఫొటోను పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి. అప్‌లోడ్ పూర్తయ్యే వరకు పేజీని క్లోజ్ చేయకుండా వేచి ఉండాలి. ఫొటోకు సంబంధించి పోర్టల్‌లో ఏవైనా ప్రత్యేక నిబంధనలు లేదా సూచనలు కనిపిస్తే వాటిని తప్పకుండా పాటించాలి.

స్టెప్ 5: సెల్ఫీని సబ్మిట్ చేయండి

ఫొటో అప్‌లోడ్ చేసిన తర్వాత పోర్టల్‌లో చూపించే Submission ప్రక్రియను పూర్తి చేయాలి. అప్‌లోడ్ చేసిన ఫొటో వెంటనే ప్రచార గ్యాలరీలో కనిపించకపోవచ్చు. అధికారిక పోర్టల్ ప్రకారం ఫొటోలు moderation కు వెళ్లే అవకాశం ఉంది. ఆ సమయంలో Pending Moderation, Rejected లేదా Successfully Submitted వంటి స్టేటస్‌లు కనిపించవచ్చు.

స్టెప్ 6: సర్టిఫికెట్ ఎలా పొందాలి?
సెల్ఫీ సబ్మిషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత పోర్టల్‌లో కనిపించే ‘Generate Certificate’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అనంతరం అవసరమైన వివరాలను పూర్తి చేసి సర్టిఫికెట్‌ను జనరేట్ చేసుకోవచ్చు. అధికారిక పోర్టల్‌లోని సెల్ఫీ అప్‌లోడ్ ప్రక్రియలో సర్టిఫికెట్ జనరేట్ చేసుకునే సదుపాయం చివరి దశగా అందుబాటులో ఉంది.

డిజిటల్ సర్టిఫికెట్ సేవ్ చేసుకోండి

సర్టిఫికెట్ జనరేట్ అయిన తర్వాత దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు మరియు మీ ఫోన్, కంప్యూటర్‌లో సేవ్ చేసుకోవచ్చు. అవసరమైతే సోషల్ మీడియా ద్వారా కూడా షేర్ చేసుకోవచ్చు.

Image Credit: harghartiranga.com

పోర్టల్‌లో మార్పులు ఉండొచ్చు..

Har Ghar Tiranga 2026 ప్రచారం కొనసాగుతున్న సమయంలో అధికారిక పోర్టల్‌లోని ఆప్షన్లు, ఇంటర్‌ఫేస్‌లో మార్పులు జరిగే అవకాశం ఉంది. అందువల్ల సెల్ఫీ అప్‌లోడ్, సర్టిఫికెట్ జనరేషన్ సమయంలో వెబ్‌సైట్‌లో కనిపించే తాజా సూచనలను అనుసరించడం మంచిది.

ముఖ్యంగా వ్యక్తిగత వివరాలు నమోదు చేసేటప్పుడు అధికారిక Har Ghar Tiranga పోర్టల్‌నే ఉపయోగిస్తున్నారో లేదో చూసుకోవాలి.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

janavaaniAD

జిల్లా వార్తలు

సినిమా వార్తలు