మహిళలకు ఇండియన్ ఆర్మీలో గోల్డెన్ ఛాన్స్.. నెలకు రూ.56 వేల స్టైపెండ్‌తో ఉద్యోగాలు

దేశ సేవ చేయాలనే లక్ష్యంతో ఉన్న మహిళా అభ్యర్థులకు ఇండియన్ ఆర్మీ గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్–125వ కోర్సు కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అవివాహిత మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భారత సైన్యంలో అధికారులుగా చేరే అవకాశం పొందనున్నారు.

22 జులై, 2026 9:49 PM•ByNarender Kumar Nangunoori

Share this article

మహిళలకు ఇండియన్ ఆర్మీలో గోల్డెన్ ఛాన్స్.. నెలకు రూ.56 వేల స్టైపెండ్‌తో ఉద్యోగాలు

దేశానికి సేవ చేయాలనే కల ఉన్న మహిళలకు ఇండియన్ ఆర్మీ గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్–125వ కోర్సు కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అవివాహిత మహిళా అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భారత సైన్యంలో అధికారులుగా చేరవచ్చు.

ఇండియన్ ఆర్మీ.. NCC స్పెషల్ ఎంట్రీ స్కీమ్–125వ కోర్సు (ఏప్రిల్ 2027 బ్యాచ్) కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నియామకాలు షార్ట్ సర్వీస్ కమిషన్ (నాన్-టెక్నికల్) విధానంలో జరుగనున్నాయి.

మొత్తం 6 ఖాళీలు ఉన్నాయి. వీటిలో 5 పోస్టులు ఎన్‌సీసీ మహిళా అభ్యర్థులకు, మరో ఒక పోస్టు ఆర్మీ పర్సనల్ బ్యాటిల్ క్యాజువాలిటీస్ విభాగానికి కేటాయించారు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎన్‌సీసీ అభ్యర్థులు NCC 'C' సర్టిఫికెట్‌లో కనీసం 'B' గ్రేడ్ సాధించి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 19 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియలో షార్ట్‌లిస్టింగ్, SSB ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.

ఎంపికైన అభ్యర్థులకు చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (OTA)లో 49 వారాల శిక్షణ అందిస్తారు. శిక్షణ సమయంలో నెలకు రూ.56,100 స్టైపెండ్ చెల్లిస్తారు.

శిక్షణ పూర్తయిన తర్వాత అభ్యర్థులను లెఫ్టినెంట్ హోదాలో నియమించడంతో పాటు జీతభత్యాలు, ఇతర అలవెన్సులు అందిస్తారు. అలాగే మద్రాస్ యూనివర్సిటీ నుంచి పోస్ట్ డిప్లొమా ఇన్ డిఫెన్స్ మేనేజ్‌మెంట్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ కూడా ప్రదానం చేస్తారు.

ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూలై 21 నుంచి ఆగస్టు 21, 2026 వరకు ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

ముందుగా ఇండియన్ ఆర్మీ అధికారిక రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్‌ (www.joinindianarmy.nic.in) లోకి వెళ్లాలి. Officer Entry Application/Login విభాగాన్ని ఎంచుకుని రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. ఇప్పటికే రిజిస్టర్ అయి ఉంటే పాత వివరాలతో లాగిన్ అవ్వాలి. సంబంధిత NCC స్పెషల్ ఎంట్రీ స్కీమ్ నోటిఫికేషన్‌ను ఎంచుకుని అప్లికేషన్ ఫారమ్ పూర్తి చేయాలి. వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, ఇతర అవసరమైన సమాచారాన్ని నమోదు చేసి సబ్మిట్ చేయాలి.

భారత సైన్యంలో అధికారిగా దేశ సేవ చేయాలనుకునే మహిళలకు ఇది ఒక అద్భుతమైన అవకాశం.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు