Anganwadi Recruitment 2026: తెలంగాణ మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లాలో అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లాలోని ఆమనగల్, చేవెళ్ల, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, శేరిలింగంపల్లి, షాద్‌నగర్ ఐసీడీఎస్ (ICDS) ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 125 అంగన్‌వాడీ టీచర్, ఆయా పోస్టులను భర్తీ చేయనున్నారు.
ప్రాజెక్టుల వారీగా పోస్టులు
ఆమనగల్ – 31 పోస్టులు
చేవెళ్ల – 29 పోస్టులు
హయత్‌నగర్ – 3 పోస్టులు
ఇబ్రహీంపట్నం – 21 పోస్టులు
మహేశ్వరం – 10 పోస్టులు
శేరిలింగంపల్లి – 5 పోస్టులు
షాద్‌నగర్ – 26 పోస్టులు
అర్హతలు ఇవే..
అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే మహిళా అభ్యర్థులు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థి తప్పనిసరిగా స్థానిక మహిళ అయి ఉండాలి.
పట్టణ ప్రాంతాల్లో సంబంధిత వార్డులో, గ్రామీణ ప్రాంతాల్లో అంగన్‌వాడీ కేంద్రం ఉన్న గ్రామ పంచాయతీ పరిధిలో నివసించే అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. ఇందుకు సంబంధిత తహసిల్దార్ జారీ చేసిన నివాస ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి. నోటిఫికేషన్ జారీకి ముందు ఒక సంవత్సరంలోపు జారీ చేసిన నివాస ధ్రువీకరణ పత్రాన్నే పరిగణనలోకి తీసుకుంటారు. అదేవిధంగా, ఆయా పోస్టులకు నిర్దేశించిన రోస్టర్ పాయింట్, కులానికి చెందిన అభ్యర్థులు మాత్రమే సంబంధిత పోస్టులకు అర్హులు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలు, విధులు నిర్వహించే సామర్థ్యం ఉన్న దివ్యాంగ మహిళా అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం
అంగన్‌వాడీ టీచర్ పోస్టుల ఎంపికను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా ఎంపిక కమిటీ చేపడుతుంది. అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి గరిష్ఠంగా 10 మార్కులు కేటాయిస్తారు. విద్యార్హత మార్కులకు కూడా వెయిటేజీ ఉంటుంది.
ఇంటర్మీడియట్ మార్కులకు – 70% వెయిటేజీ
వితంతువులకు – 5%
అనాథలకు – 10%
దివ్యాంగులకు – 5%
ఇంటర్వ్యూ మార్కులు – 10 మార్కులు
విద్యార్హతలు, రిజర్వేషన్ నిబంధనలు, ప్రత్యేక కేటగిరీల వెయిటేజీ, ఇంటర్వ్యూ మార్కులను పరిగణనలోకి తీసుకుని తుది ఎంపిక చేపడతారు.
చివరి తేదీ
అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు 2026 సెప్టెంబరు 10లోపు ఆన్‌లైన్‌లో (https://mis.tgwdcw.in/Recruit_Inter.aspx) దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా అవసరమైన ధ్రువపత్రాలను సిద్ధం చేసుకుని ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మంచిది.
గమనిక: దరఖాస్తు చేసే ముందు సంబంధిత అధికారిక నోటిఫికేషన్‌లో పోస్టుల వారీగా రోస్టర్, స్థానికత, ధ్రువపత్రాలు, ఇతర నిబంధనలను తప్పనిసరిగా పరిశీలించాలి.




















